అప్రియ సత్యం అనర్ధదాయకం

31 Dec, 2020 06:49 IST|Sakshi

శృతి, స్మృతి, పురాణేతిహాసాలలో మాటకు చాలా విలువ ఇవ్వబడింది. మాట ఎలా ఉండాలో వేదాల్లో చాలా చోట్ల వివరించడం జరిగింది. "వాగ్ఘి సర్వస్య కారణం" మాటే అన్నిటి కారణం అని వేదాధ్యానం చేసిన ఋషులన్నారు. సత్యంగా, ప్రియంగా, హితంగా, శాస్త్రాధ్యయనం వలన కలిగిన సంస్కా రంతో మాట్లాడితే అది 'వాచకతపస్సు,' అని గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు అన్నాడు. సత్యం మాట్లాడినా అది మృదువుగా, స్నేహ యుక్తంగా ఉండాలి. అది కార్య సాధకుల లక్షణం. ప్రయోజనం దెబ్బ తినకుండా పనిని సాధించడమే దృష్టిలో పెట్టుకున్న వాడు తననీ, తన మాటనీ కూడా నియంత్రించుకుంటాడు. అయితే ఆ పెద్దలే ఒక హెచ్చరిక కూడా చేసారు. ఎంతటి కటు సత్యమైనా అప్రియంగా మాట్లాడరాదు.

సత్యం అయినా అది అప్రియం అయితే ఆ సత్యాన్ని వాక్కొనక పోవడమే ఉభయత్రా మంచిది.
అప్రియమైన సత్యాన్ని చెబుతే ఎదుటి వారు దానిని తమ అవమానంగా పరిగణిస్తారు. లేదా అలాంటి ప్రీతికరం కాని నిజం చెప్ఫి నతనికే కష్టాలు రావచ్చు. నిందాత్మకమయిన వాక్య శ్రణవం ఒక పాపంతో సమానం.అందుకే " భద్రం కర్ణేభిః శ్రుణుయామ"అని ఒక ఉపనిష ద్వాక్యం.అనగా చెవులతో శుభకరంవచనాలనే విందుము గాక! అనే ఆకాంక్షను ఋషులు వెల్లడించారు. 

ఇప్పడు అప్రియమైన సత్య వచనం పలక డం వలన కలిగే అనర్ధాలను పరిశీలిద్దాం.
అష్టావక్రుడు ఆత్మజ్ఞాని.ఆయన రచించిన 'అష్టావక్ర గీత' భగవద్గీతకు సమానంగా జ్ఞాన బోధనలు ప్రసాదిస్తుంది. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్న సమయంలో, ఆయన తండ్రి వేదాలను అసంబద్ధంగా పఠించసాగేడు తండ్రి చేసిన పొరపాటును గర్భస్థశిశువు తండ్రికి చెప్తాడు. కోపంతో తండ్రి శపిస్తాడు. ఆ కారణంగా అష్టావక్రుడుఎనిమిది వంకరలతో జన్మించాడు. శారీరకంగావైకల్యం ప్రాప్తించినా విద్వత్తులో మాత్రం. అష్టావక్రుడు అసాధారణ ప్రజ్ఞను సంపాదించగలిగాడు అలా జ్ఞానిగా పన్నెండేళ్ళ వయసులో ఒక రోజు సీతాదేవి తండ్రి అయిన జనకమహారాజు కొలువుకు వెళ్ళాడు.

శారీరక వైకల్యంతో అతను ప్రతి చోటా అవమానాలనే ఎదుర్కొనేవాడు. చివరకు జనకమహారాజు కొలువులోనూ అష్టావక్రుడు అడుగు పెట్టగానే అపహాస్యాలువినిపించాయి తలపండిన మేధావులు, పండితులు విద్వాంసులు కూడా సాధారణ జనం మాదిరిగానే అష్టావక్రుడిని చూడగానే ముసిముసిగా నవ్వుకోవడం, గేలిచేయడం ప్రారంభించారు. వాళ్ళందరి వైఖరిని చూసి అష్టావక్రుడు కూడా బిగ్గరగా నవ్వసాగేడు. ఒక్కసారిగా జనకుడు అమితాశ్చర్యంతో "అష్టావక్రా! వారందరూ ఎందుకు నవ్వుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కాని అసలు నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు అవగతం కావడం లేదు?" అన్నాడు.

అష్టావక్రుడు ప్రశాంత చిత్తంతో, వికసిత వదనంతో "జనకమహారాజా!మీ సభలో పండితులు, మేధావులు ఉంటారని,వారిని దర్శింకొని తరిద్దామని వచ్చాను. కానీ ఇక్కడ కూడా సాధారణ చర్మకారులే ఉంటారాని అనుకో లేదు.వాళ్ళకు చర్మాన్నే తప్ప దాని వెనుక ఉన్న విశేష గుణాన్ని చూసే దృష్టి, శక్తి లేవని తెలుసుకున్నాను. ఆలయం వంకరలు తిరిగినంత మాత్రాన దాని వెనుక నున్న ఆకాశం వంకరలు తిరుగుతుందా? మట్టికుండపగిలిపోయినంత మాత్రాన అందులోని చిదాకాశం చితికిపోతుందా? అనంతమైనది, అవిచ్ఛన్నమైంది ఆకాశం! అలాగే నా శరీరం మెలికలు తిరిగిందే. కాని 'నేను' కాదు. సభ ఒక్కసారిగా సిగ్గుతో తలదించుకుంది జనకమహారాజు వినమ్రంగా అష్టావక్రుడికి సాష్టాంగ ప్రణామం చేసాడు. గురువుగా భావించి పూజించాడు. బలవంతుడైన ఒక రాజుగారు అడిగిన ప్రశ్నకు జవాబుగా సత్యమే. ఆయినా. అప్రియంగా చెప్పి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఒక జ్యోతిష్య పండితుడు . ఆ కథ తెలుసుకుందాం.

ఒక రాజుగారికి నిద్రలో ఒక కల వచ్చింది ఒక పచ్చని చెట్టుకు ఎన్నో .ఆకులుంటాయి ఆ కలలో ఒక ఆకు తరువాత మరొకటి రాలిపోతూంటుంది.చివరకుఒకేఒక ఆకుమిగిలింది మరునాడు దర్బారులో మంత్రులకు సామంతులకు, సభికులకు తన స్వప్న వృతాంతం చెష్పి దాని అర్ధం ఏమిటి అని అడుగుతాడు అది ఒక కల. కలలో ఎన్నో విచిత్రాలుచూస్తూ  వుంటాము. ఒకొక్కప్పుడు భయం వేస్థుంది వేరొకప్పుడు సంతోషం కలిగుతుంది.కలకు అర్ధంపర్ధం ఉంటుందా? ఎవరు రాజుగారికి జవాబుచెప్పలేక పోయారు రాజు ఉగ్రుడయ్యాడు "మీరు అవివేకులు, జ్ఞానంలేనివారు మిమ్మల్నికొలువులోఉంచుకొని జీతాలివ్వడం దండుగ"అన్నాడు. ఇద్దరు జ్యోతిష్యులు నగరంలోని వచ్చి రాజ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు అని వార్తాహరులు చెప్పిన విషయం మంత్రికి గుర్తుకొచ్చింది.

"రాజా!ఎవరో ఇద్దరుజ్యోతిష్యపండితులు ఈ రోజే మన నగరానికి వచ్చారు. వారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు కాబట్టి మీ స్వప్నం ఏమిటో విడమరిచిచెప్పగలుగుతారు. మీ ఆజ్ఞ. అయితే ఇప్ఫడే వారి నిక్కడకు రప్పిస్తాను" అన్నాడు మంత్రి ఆ ఇద్దరు జ్యోతిష్యులు ఒకే గురువు వద్ద విద్యనభ్యసించేరు ఇద్దరూ సమములు ఒకరు ఎక్కువ వేరొకరు తక్కువ కాదు. రాజుగారి వద్ద తమ శాస్త్ర జ్ఞానం ప్రదర్శించి భూరిగా సంభావన పొందాలనే వచ్చారు. రాజు దర్శనం సునాయాసంగానే లభించింది.రాజు తన కొచ్చిన కలను చెప్పి దాని అర్ధం ఏమిటి అని అడిగాడు. ఆ ఇద్దరు రాజుగారి  నుంచి మరికొన్ని వివరాలు అడిగితెలుసుకుని  స్వప్నశాస్త్ర గ్రంధాలను చూసి కొంతసేపు లెక్కలు వేసారు.కొంత సేపుతరువాతఒకడు లేచి "రాజా! నాకు అంతా అవగతమైందిస్వప్న ఫలితంగా నేను చెప్పినట్లు తు.చ. తప్పక జరుగుతుంది. సెలవిస్తే చెప్తాను" అన్నాడు.

సరే చెప్పు అని అనగానే "ఆ చెట్టు ఆకులు ఒకటి తర్వాత ఒకటి రాలినట్లు మీ సంతానం లోని వారందరు మీ. కళ్ళ ముందే. ఒకరి. తర్వాత మరొకరు చనిపోతారు కాని మీరు  చిరంజీవిగా చాలా కాలం జీవిస్తారు" అన్నాడు. ఆ జ్యోతిష్యడు అలా అనగానే రాజుకోపం వచ్ఛంది.తన కుటుంబంలో అందరుతన కన్నా ముందేచనిపోతారంటేవినిఎలాసహించగలడు " ఇలాంటి అవాకులు పలికే ఇతని శిరఛ్ధేం చేయండి." అని భటులను ఆజ్ఞాపించాడు. అంతలో రెండవ జ్యోతిష్యడు లేచి "రాజా! నా మిత్రుడు తప్పు లెక్కలు వేసాడు. అందుకే అలా చెప్పాడు."అన్నాడు. అంటే నువ్వు సరి అయిన లెక్కలు వేసానంటావు నీవుతప్పుచెప్తే నీ తల కూడా ఎగిరి పోతుంది అదిగుర్తుంచుకో అన్నాడు రాజు.

"రాజా! మీ ఆయుష్షు రేఖ జర్రిపోతు లాగుంది.మీరు చాలా కాలం జీవిస్తారు. మీరు రాజ్యన్ని ప్రజారంజ కంగా పాలిస్తారు. శ్రీ రామ చంద్రునిలా మీ కీర్తి ఆచంద్రర్కం ఉంటుంది. మీకు వెన్నుపోటు పొడవడానికి మీ కుటుంబంలో ఎవరు ఉండరు." అన్నాడు జ్యోతిష్యుడు రాజుగారికి అది శ్రవణానందకరంగా వినిపి చింది. రాజు. సంతోషంతో. నీకేది కావాలో కోరుకో అన్నాడు. ఆ రెండవ జ్యోతిష్యడు 'నా మిత్రునికి మీరు విధించిన దండనను రద్దు చేయండి. అతను అప్రియంగా. ఒక సత్యాన్ని చెప్పాడు. అతను చెప్పినదే నేనూ చెప్పాను. కాని మీకు నేను చెప్పినది సంతో షం కలిగిం చింది. రాజు అర్థం చేసుకున్నాడు. శిక్షను రద్దు చేసి.ఇద్దరికి కానుకలిచ్చి పంపించాడు మానవ సంబంధాలకు మాట సూత్రం సత్యమే మాట్లాడినా అది మృదువుగా హితంగా ఉండాలి. ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కామాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తష్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ!
- గుమ్మా ప్రసాదరావు

మరిన్ని వార్తలు