ఉల్లిపాయ రసంలో బాదం నూనె కలిపి జుట్టుకు పట్టిస్తున్నారా? కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి ముఖానికి రాస్తే!

7 Oct, 2022 12:44 IST|Sakshi

Hair Care And Beauty Tips In Telugu: జుట్టు రాలడం తగ్గాలంటే ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. బాదం నూనెతో వీటిని కలిపి కురులకు పట్టిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

ఉల్లిపాయ రసంలో..
మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకుని సన్నగా తురిమి రసం తియ్యాలి.
ఈ రసాన్ని  రెండు టేబుల్‌ స్పూన్ల బాదం నూనెలో వేసి కలిపి, కుదుళ్ల నుంచి చివర్లవరకు పట్టించి ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి.
నలభై నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. 

ఉసిరిపొడితో.. 
బాదం నూనెలో ఉసిరిపొడి లేదా రెండు టీస్పూన్ల తాజా నిమ్మరసం వేసి కలిపి జుట్టుకు పట్టించాలి.
మర్దనచేసి అరగంట తరువాత తలస్నానం చేయాలి.
వారానికి రెండు సార్లు ఈవిధంగా చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
కురులకు పోషణ అంది నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతాయి.

ఆవనూనె వల్ల..
ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్‌ ఎ పుష్కలంగా లభిస్తుంది.
ఇది జుట్టు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది.
అంతేకాదు, చుండ్రు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
కానీ ఆవాలను మోతాదుకు మించి ఒకేసారిగా ఎక్కువగా వాడితే టాక్సిక్‌ కారణంగా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మొటిమలను తగ్గించుకోవాలంటే..
కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారనివ్వాలి.
ఆ తర్వాత ఆ నూనెను వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు నీటితో ఈ నూనెను కలిపి ముఖానికి పట్టించాలి.
ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా..
Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి..

మరిన్ని వార్తలు