Hair Care Tips: అలోవెరా, కాఫీ పొడి, విటమిన్‌ ఈ క్యాప్సూల్‌.. ఎండుగడ్డిలా ఉండే జుట్టు సైతం!

27 Sep, 2022 10:43 IST|Sakshi

నిర్జీవంగా... ఎండుగడ్డిలా ఉండే కేశాలను సిల్కీగా, షైనింగ్‌గా మార్చుకునేందుకు ఇంట్లో దొరికే వాటితో ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...

►టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను కాఫీ పొడి, టీస్పూను సాధారణ షాంపు, విటమిన్‌ ఈ క్యాప్సూల్‌ను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి.

►ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకు కండీషనర్‌లా అప్లైచేసి గంట తరువాత నీటితో కడిగేయాలి.

►వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతోపాటు సిల్కీగా మెరిసిపోతుంది. 

►ఇక జట్టు తరచుగా చిక్కులు పడుతుంటే.. కెరాటిన్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే మేలు. దీనివల్ల జుట్టు మృదువుగా మారడమేగాక మెరుపుని సంతరించుకుంటుంది. 

►అదే విధంగా.. మార్కెట్లో అనేక రకాల సీరమ్‌లు దొరుకుతున్నాయి. వాటిలో మీ జుట్టుకు నప్పే సీరమ్‌ను ఎంచుకుని వాడితే  కురులు మృదువుగా మారతాయి. 

►ఇక చర్మ సంరక్షణలో వాడే గ్లిజరిన్‌ కేశాల సమస్యలకు మంచి పరిష్కారం చూపుతుంది. గ్లిజరిన్‌ను జుట్టుకు కండీషనర్‌లా పట్టిస్తే.. కురులు పొడిబారడం తగ్గి మృదుత్వాన్ని సంతరించకుంటాయి. 

చదవండి: Tara Sutaria: ఇలా చేస్తే చాలు.. ముఖం మెరిసిపోతుంది! బ్యూటీ సీక్రెట్‌ చెప్పిన హీరోయిన్‌
Hair Care Tips: ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే! ఈ సమస్యలు తప్పవు!

మరిన్ని వార్తలు