Hair Straightening Tips: కొబ్బరి నీళ్లు, ఆలివ్‌ ఆయిల్‌ ఉంటే చాలు! జుట్టు స్ట్రెయిటనింగ్‌ ఇలా!

23 Jun, 2022 09:50 IST|Sakshi

నేచురల్‌ స్ట్రెయిటనింగ్‌

Hair Straightening Tips Without Using Heat: రసాయనాలు ఎప్పుడూ జుట్టు సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకే ఎటువంటి రసాయనాలు, స్ట్రెయిటనింగ్‌ యంత్రాలు వాడకుండా రింగులు తిరిగిన కురులను సహజసిద్ధంగా స్ట్రెయిటనింగ్‌ ఎలా చేసుకోవచ్చో చూద్దాం...

రింగుల జుట్టుని స్ట్రెయిట్‌గా మార్చేందుకు... కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలపాలి.
ఈ నీటిని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి నలభై నిమిషాలు ఆరనివ్వాలి.
తరువాత చల్లటినీళ్లు, సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి, వారానికి ఒకసారి ఇలా చేయాలి.

ఇలా కూడా చేయొచ్చు!
ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనెలో ఆలోవెరా జెల్‌ వేసి చక్కగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి నలభై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
తరువాత సల్ఫేట్‌ లేని షాంపుతో తలస్నానం చేయాలి.

వీటిలో ఏ ఒక్క పద్ధతిని అయినా క్రమం తప్పకుండా అనుసరిస్తే రింగులు తిరిగిన జుట్టు స్ట్రెయిట్‌గా మారి మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.  

చదవండి: Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెతో
దీపిక పదుకోణ్‌ ఒత్తయిన జట్టు వెనుక రహస్యమిదే..!

మరిన్ని వార్తలు