Hair Care Tips: జుట్టు రాలడం.. చుండ్రు సమస్య వేధిస్తోందా? కొబ్బరి నూనె, ఆముదం కలిపి..

29 Sep, 2022 09:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కురులకు టానిక్‌

కురులు ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరకుంటుందనడంలో సందేహం లేదు. కానీ కాలుష్యం, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలడం సహా చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తోంది. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

కొబ్బరి నూనె, ఆముదం సమపాళ్లల్లో తీసుకుని చక్కగా కలపాలి.
ఈ నూనెను మాడుకు, జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పదినిమిషాలపాటు మర్దన చేయాలి.
రెండు గంటల తరువాత తలస్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల ఆముదంలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు జుట్టుకు అంది చుండ్రు రానివ్వకుండా చేస్తాయి.
కురులలో వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌ దరిచేరవు.
పీహెచ్‌ స్థాయులు నియంత్రణలో ఉండి జుట్టురాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. 

ఇవి తింటే ఆరోగ్యకరమైన కేశాలు
బ్రౌన్‌ బ్రెడ్‌ తినడం వల్ల కురుల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
రాగి, జొన్న, సజ్జ, బార్లీ పిండిలను కలిపి రొట్టె చేసుకుని తినాలి. 
బ్రకోలి, పాలకూర, కాకరకాయ, బీన్స్‌ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్‌ కే, ఫోలేట్‌లు పుష్కలంగా ఉంటాయి. 
తులసి, పుదీనా, సొరకాయల జ్యూస్‌.. బెల్లం, తులసి ఆకులతో చేసిన టీ కూడా జుట్టుకు పోషణ అందిస్తుంది. 

చదవండి: Breast Cancer Screening: అవివాహిత మహిళలు, పిల్లలు కలగని స్త్రీలు! ఇంకా వీరికి

మరిన్ని వార్తలు