కిస్‌ చేస్తే ఇది ‘మిస్‌’ కారు..

13 Feb, 2021 12:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కిస్‌.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌గా‌ తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్‌ వీక్‌లో​ లవర్స్‌ ఈరోజు (ఫిబ్రవరి 13)ను  కిస్‌డే గా సెలబ్రెట్‌ చేసుకుంటారు. అయితే ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్‌ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. అవేంటో చదివేయండి...

ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్‌ చేస్తారు. ఈ చర్యతో వారే తమ ప్రపంచమని మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇలా చేయడం వలన ప్రేమించిన వారి పట్ల తమకున్న ప్రేమ, నమ్మకం, పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రేమికులు గాఢంగా చుంబించుకోవడం వలన కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఒత్తిడి తగ్గి వారి మధ్య ఒక బాండింగ్‌ క్రియేట్‌ అవుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది.

కిస్‌ చేస్తే.. 
తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర తీసుకొని నుదుటి పైన కిస్‌ చేస్తారు. ఈ చర్యతో వారిని ఆశీర్వదిస్తారు. ఒక్కొసారి పిల్లలు తమ వారు కిస్‌చేయడం వలన తామున్నమనే భరోసా ఏర్పడుతుందని అనుకుంటారు. చుంబించుకోవడం అనే చర్య వలన మానసిక ఆనందం కలిగి మాములు కన్నా 5 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 

చదవండి:  
ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో!

మరిన్ని వార్తలు