దానిమ్మ వల్ల కలిగే ఆరోగ్య ప్రయెజనాలెన్నో..! 

17 Jul, 2022 07:37 IST|Sakshi

మెడిటిప్‌ 

ఒక రకరమైన ఇబ్బందికరమైన ఇనుము రుచితో ఉండే ఐరన్‌ ట్యాబ్లెట్లు వాడటం కంటే హాయిగా తినాలనిపించే రుచికరమైన దానిమ్మతో ఒంట్లో ఐరన్‌ మోతాదులు పెరుగుతాయి. అలా ఈ పండు రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తనాళాలనూ శుభ్రపరుస్తుంది. ఒంటికి మంచి ఆరోగ్యకరమైన రక్తం పట్టడం వల్ల మనిషి చురుగ్గానూ మారుతారు. ఇక ఇదే దానిమ్మ బరువు పెరగకుండా కూడా నివారిస్తుంది.

ఇలా దానిమ్మతో బరువు తగ్గడానికి కారణం... ఇందులో ఉండే దాదాపు 7 గ్రాముల పీచు. ఇలా బరువు తగ్గించడం ద్వారా ఇది గుండెజబ్బులనూ నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే విటమిన్‌ కె, విటమిన్‌ సీ వంటి విటమిన్ల వల్ల రోగనిరోధకSశక్తిని పెంపొందిస్తుంది. ఇందులోని పొటాషియమ్‌ రక్తపోటును అదుపులో పెడుతుంది. దాదాపు 25 గ్రాముల చక్కెర కారణంగా తక్షణం 144 క్యాలరీల శక్తి సమకూరుతుంది.

తక్కువ చక్కెర, ఎక్కువ పీచు ఉండటం అన్న అంశం కూడా వేగంగా బరువు తగ్గడానికి/పెరగకుండా నివారించడానికి తోడ్పడతాయి. అన్ని రకాల పండ్లూ ఆరోగ్యానికి మంచివే అయినా... ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను ఒక పండే ఇవ్వడం అన్నది చాలా కొద్ది పండ్ల విషయంలోనే ఉంటుంది. అందుకే రక్తహీనత తగ్గడం, బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచుకోవడం, వ్యాధినిరోధకతను పెంచుకోవడం లాంటి బహుళ ప్రయోజనాలను పొందాలంటే దానిమ్మ పండు తినడం రుచికరమైన ఓ మంచి మార్గం.

మరిన్ని వార్తలు