ఈ మెషిన్‌ ఫ్యాట్‌ని ఇట్టే మాయం చేస్తుందట!

18 Jul, 2021 18:37 IST|Sakshi

ఎంత ఆహారనియమాలు మార్చుకున్నా.. ఎన్ని చిట్కాలు పాటించినా శారీరక శ్రమ లేకపోతే.. వయసుతో పాటు బరువు పెరగడం సర్వసాధారణం. తొడలు, నడుము.. ఒక్కటేమిటీ శరీరంలోని ప్రతి భాగంలోనూ కొవ్వు పేరుకుపోతుంది. శరీరం షేప్‌ అవుట్‌ అయిపోయి వేసుకున్న డ్రెస్‌కి, కట్టుకున్న చీరకు అందం రాకుండాపోతుంది. అలా అని ఉదయాన్నే లేచి వ్యాయామం చేసేంత తీరిక, ఓపిక లేని బిజీ లైఫ్‌ మనది.

మరి దీనికి పరిష్కారం ఏమిటీ? ఇదిగో.. ఈ చిత్రంలోని బాడీ షేపింగ్‌ మసాజర్‌ (రెడ్‌ లైట్‌ సోనిక్‌ రీచార్జబుల్‌ వైబ్రేషన్‌ బ్యూటీ డివైజ్‌).. ఫ్యాట్‌ని ఇట్టే మాయం చేస్తుంది. ఇందులోని అల్ట్రాసోనిక్‌ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్‌ టెక్నాలజీ.. సెకనులో 3 లక్షల సార్లు వైబ్రేట్‌ అవుతూ బాడీని రిపేర్‌ చేస్తుంది. చేతులు, కాళ్లు, పొత్తికడుపు భాగాల్లో పేరుకున్న కొవ్వుని కరిగించేస్తుంది.  రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్‌ కలిగిన ఈ డివైజ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండానే స్లిమ్‌గా మారుస్తుంది. దీని రెడ్‌ లైట్‌ వేవ్‌లెంగ్త్‌ ఫంక్షనల్‌ ప్రక్రియ.. చర్మ కణాలను ఉత్తేజితంచేసి స్కిన్‌టోన్‌ను మెరుగుపరుస్తుంది.

ఈ మల్టీఫంక్షనల్‌ బ్యూటీ డివైజ్‌లో స్కిన్‌ మోడ్, ఫ్యాట్‌ బర్నింగ్‌ మోడ్‌ 1, ఫ్యాట్‌ బర్నింగ్‌ మోడ్‌ 2, షేపింగ్‌ మోడ్‌ ఇలా నాలుగు రకాల మోడ్స్‌ ఉంటాయి. వాటితో పాటు ఆన్‌ / ఆఫ్‌ బటన్‌  కూడా ఉంటుంది. దాంతో దీని వినియోగం చాలా సులభం. పైగా దీన్ని చేత్తో చాలా ఈజీగా పట్టుకుని కొవ్వు ఉన్న భాగంలో మూవ్‌ చేసుకోవచ్చు. తేలికగా ఉండటంతో ప్రయాణించేటప్పుడు వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 68 డాలర్లు. అంటే సుమారు రూ. 5 వేలు. 

మరిన్ని వార్తలు