హెల్త్‌ టిప్స్‌

25 Feb, 2023 04:02 IST|Sakshi

రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో చిన్న పటిక బెల్లం ముక్కను వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. 
 చిటికెడు పసుపును గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.. 
 గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ముక్కలుగా చేసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. 
 దగ్గు, ఆయాసంతో బాధపడేవారు స్పూన్‌ అల్లం రసం, స్పూను దానిమ్మరసం, స్పూన్‌ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరి ∙చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే సమస్య తొలగుతుంది, 
 అజీర్ణం, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు