ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారా? ఐతే ఇవి తినండి..

21 Oct, 2021 11:15 IST|Sakshi

శరీరంలో తగినంత ఐరన్‌ ఉత్పత్తికాకపోతే రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా తరచూ మైకం కమ్మడం, శక్తి హీణత వంటి సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లోనైతే పెరుగుదల మందగిస్తుంది కూడా. నిజానికి ఐరన్‌ అన్ని వయసులవారికి అవసరమే. కాబట్టి ఇతర విటమిన్లు, మినరల్స్‌ మాదిరిగానే ఐరన్‌ కూడా తగు మోతాదులో అవసరమేనన్నమాట. ఐరన్‌ పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలను ఢిల్లీకి చెందిన ప్రముఖ నూట్రీషనిస్ట్‌ డా. అనిత వర్మా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

చదవండి: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. ఇవి తిన్నారంటే..!

శనగలు
మన వంటకాల్లో తరచూ ఉంపయోగించే శనగల్లో ఐరన్‌ నిండుగా ఉంటుంది. కాయధాన్యాలు లేదా పప్పుదినుసుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే! ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం పెసలు, అలసందలు, వులవలు, బీన్స్‌, చిక్కుడు గింజలు, శనగల వంటి కాయధాన్యాల్లో ఐరన్‌ స్థాయిలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!!

గుడ్డు
సహజంగానే గుడ్డులో ఐరన్‌తోపాటు అనేక విటమిన్లు, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. కర్రీ, ఫ్రై వంటి వంటకాల రూపంలో ప్రతిరోజూ గుడ్డు మన ఆహారంలో చోటుచేసుకుంటూనే ఉంటుంది. యూఎస్‌డీఏ ప్రకారం వంద గ్రాముల గుడ్డు తీసుకుంటే ఒక రోజుకు అవసరమైన 1.2 మిల్లీగ్రాముల ఐరన్‌ అందుతుందని వెల్లడించింది.

బీట్‌రూట్‌
బీట్‌రూట్‌లో పొటాషియం, పాస్పరస్‌, కాల్షియం, కార్బొహైడ్రేట్‌ ప్రొటీన్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. మాక్రొబయోటిక్‌ నూట్రీషనిస్ట్‌ అండ్‌ హెల్త్‌ కోచ్‌ శిల్పా అరోరా ప్రకారం మన శరీరంలో తగినంత ఐరన్‌ను అందించడంలో బీట్‌రూట్‌ కీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. విటమిన్‌ ‘సి’ అధికంగా ఉండే ఆహారాల్లో కూడా ఐరన్‌ కంటెంట్‌ ఎక్కువగానే ఉంటుంది. చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

ఉసిరి
ఉసిరికాయలో విటమిన్ ‘సి’తోపాటు శరీరానికి అవసరమైన ఇనుము కూడా పెంచుతుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం 
ఒకేరకమైన ఆహారంతో విటమిన్ ‘సి’, ఇనుము (ఐరన్‌) రెండూ పొందుకోవాలంటే ఉసిరి బెస్ట్‌! అని పేర్కొంది.

పాలకూర
పాలకూర వంటి ఆకుపచ్చ కూరల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఇతర నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో పాలకూరను తరచూ తీసుకోవడం ద్వారా ఐరన్‌ లోపాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: మార్నింగ్‌ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరురాలైంది!!

మరిన్ని వార్తలు