Health Tips: పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్‌, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు!

27 Jun, 2022 14:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరేడేళ్లు వచ్చినా పక్కతడుపుతున్నారా? 

Bed Wetting Problem In Children: సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే కొందరు పిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తుంటే అది తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.

చల్లటి వాతావరణం, నిద్రపోయే ముందు అధిక ద్రవాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. పిల్లలు 6, 7 సంవత్సరాల వయస్సు దాటుతున్నా కూడా పక్క తడిపే అలవాటు ఉన్నట్లయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటంటే..

కారణాలు!
►పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్య తో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది.
►పిల్లాడు ఆహారంలో అధికంగా కెఫిన్‌ లేదా డైయూరిటిక్స్‌ వంటివి ఎక్కువగా ఉన్నా కూడా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.

►మధుమేహం ఉన్నా కూడా పిల్లలకు మూత్ర నియంత్రణ ఉండదు.
►యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చినా, ఒత్తిడి లేదా మానసిక సమస్యలున్నా కూడా మూత్ర నియంత్రణ ఉండదు.
►కాబట్టి పై కారణాల్లో ఏదో వైద్యుని సహాయంతో తెలుసుకుని తగిన చికిత్సను అందించాలి.

క్రాన్బెర్రీ జ్యూస్‌ తాగిస్తే!
►ఇవే కాకుండా జీవనశైలిలో మార్పులు, ఆహార ప్రణాళికలో మార్పులను జోడించి, ఇంట్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూడా దీన్ని నియంత్రించవచ్చు.
►పక్క తడపడం తగ్గించడంలో క్రాన్బెర్రీ జ్యూస్‌ ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్‌ రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ సమస్యను తగ్గించడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుంది.

తృణధాన్యాల వల్ల
►సహజ సిద్ధమైన ఫైబర్‌ సమృద్ధిగా ఉండే వాల్‌నట్స్, కిస్‌మిస్‌లు.. పక్క తడిపే పిల్లల సమస్యను నిరోధించడానికి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి పిల్లల పెరుగుదలకు సహాయపడే ముఖ్య ఖనిజం.
►తృణధాన్యాలు పిల్లల్లో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఓట్స్, ఫుడ్‌రైస్, కార్న్‌ఫ్లేక్స్, గోధుమ పొట్టు వంటి ధాన్యాలు పక్క తడిపే అలవాటును తగ్గిస్తాయి.

అరటిపండ్లతో అద్భుతం
►ఈ సమస్యకు అరటిపండ్లు అద్భుతమైన గృహ చిట్కాగా ఉపయోగపడతాయి. ఈ పండు జీర్ణవ్యవస్థకు సహకారాన్ని అందివ్వడమే కాకుండా మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడంలో ఉత్తమంగా ఉపయోగపడుతుంది.
►దాల్చిన చెక్క, తేనెలో ఉండే గుణాలు పిల్లల్లో పక్క తడిపే అలవాటును నివారిస్తాయి. ఇవి పీడియాట్రిక్‌ డయాబెటిస్‌ సమస్య చికిత్సలో కూడా సహకారాన్ని అందివ్వగలవు.

తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇస్తే
►ఈ సమస్యను తగ్గించడంలో తులసిని పూర్వీకుల వైద్యంగా చెప్పారు. కొన్ని తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య తగ్గిపోతుంది.
►మూత్రాశయం నిండినప్పుడు బాత్రూమ్‌కు వెళ్లాలి అని పిల్లలకి తరచూ చెబుతుండాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు సోమరితనం, మొండితనం వల్ల సరైన సమయానికి బాత్రూమ్‌కి వెళ్లకుండా లేటు చేస్తుంటారు.

ఇవి తినకూడదు
►స్వీట్లు, చాక్లెట్ల తయారీలో ఉపయోగించే కృత్రిమ రసాయనాలు, చక్కెరలు పిల్లల్లో రాత్రి సమయంలో కొన్ని జీవక్రియలకు దారితీయొచ్చు. కాబట్టి రాత్రి నిద్రపోయే ►ముందు స్వీట్లు, చాక్లెట్ల జోలికి పిల్లలు వెళ్లకుండా చేయాలి.
►రాత్రి పడుకునేముందు ఎక్కువ మంచినీరు, జ్యూస్‌లు తాగకుండా చేయాలి.

ఇలా చేయాలి!
►పడుకునే ముందు పిల్లలను బాత్రూమ్‌కి వెళ్లమని చెప్పాలి.
►వీలైతే మధ్య రాత్రులలో క్రమం తప్పకుండా పిల్లలను బాత్రూమ్‌కు తీసుకెళ్లాలి. ఇలా తరచూ చేస్తుంటే పిల్లలు త్వరలోనే ఈ అలవాటును మానేస్తారు.
చదవండి: Health Tips: ఇవి తరచుగా తింటే ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుంది! అంతేకాదు..

మరిన్ని వార్తలు