Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే..

24 Oct, 2022 11:13 IST|Sakshi

నీరసం.. నిస్సత్తువా? 

డెంగ్యూ, టైఫాయిడ్, ఇతర వైరల్‌ ఫీవర్‌ల బారిన పడిన వారు నీరసం తగ్గి త్వరగా కోలుకునేందుకు పోషకాహార నిపుణులు సూచిస్తోన్న  ఆహార చిట్కాలు
రాగులు
రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది.
అందువల్ల రాగులతో చేసిన వంటకాలను అల్పాహారంగా తీసుకోవాలి.
రాగులతో చేసిన దోశ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు, రాగుల్లో ఉన్న పాలీఫీనాల్స్‌ డయాబెటిక్‌ రోగుల్లో గ్లైసిమిక్‌  స్పందనలను తగ్గిస్తాయి.

రాగుల్లో ఉన్న క్యాల్షియం, ఫాస్పరస్‌ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రాగుల్లో అధికంగా ఉండే ఐరన్‌ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది.
అందువల్ల రాగి జావ, రాగి రొట్టెలు చాలా మంచిది.

బెల్లం
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ బి, సి అధికంగా ఉంటాయి.
నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్‌ ఏ, ఈ, డీ, కే, క్యాల్షియం అధికంగా ఉంటాయి.
ఈ రెండింటిని కలిపి భోజనం తరువాత తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడడమేగాక, ఎముకలు దృఢంగా తయారవుతాయి. 

బాదం, కిస్‌మిస్‌
బాదం పప్పులు, కిస్‌మిస్‌లను రాత్రి నానపెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి.
నానపెట్టిన కిస్‌మిస్‌లు శరీరంలో లైపేజ్‌ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి.

కిచిడి
అదే విధంగా రాత్రి డిన్నర్‌లో కిచిడి తినాలి. దీనిలో పదిరకాల ఎమినో యాసిడ్స్‌ ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. 

చదవండి: రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే

మరిన్ని వార్తలు