Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్‌నట్స్‌ ఎక్కువగా తినిపిస్తున్నారా... అయితే

25 Dec, 2021 16:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేందుకు...

Immunity Booster Foods For Kids: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే...

గుడ్డు
కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్‌ ఎ, బి2 (రైబోఫ్లేవిన్‌) కోడిగుడ్డులో లభిస్తాయి. 

ఆకుకూరలు
ఆకుకూరలు, మునగకాడలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తోపాటు ఐరన్, జింక్, మినరల్స్‌ లభిస్తాయి.

పెరుగు
పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్‌ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్‌ యోగర్ట్, వెజిటబుల్స్‌ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు.

పసుపు
పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు.

డ్రైఫ్రూట్స్‌
బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, అప్రికాట్స్‌ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

స్వీట్స్‌ వద్దు
పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి.

సరిపడా నిద్ర
ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. 

చదవండి: Health Tips: షుగర్‌, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే...

మరిన్ని వార్తలు