Heavy Bleeding: పీరియడ్స్‌లో బ్లీడింగ్‌ ఎక్కువా? ఇవి తింటే మేలు... కాలేయం, గుడ్లు ఎక్కువగా తీసుకుంటే

1 Dec, 2022 13:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పీరియడ్స్‌లో బ్లీడింగ్‌ ఎక్కువా?

Heavy Menstrual Bleeding- Iron Rich Foods: యువతుల్లో, మహిళల్లో కొందరికి ఐదు రోజుల పాటు రక్తస్రావం అవుతూ రక్తం ఎక్కువగా పోతుంటుంది. ఇలా అవుతుందంటే వీళ్లు ఐరన్‌ మోతాదులను చాలా ఎక్కువగా కోల్పోతుంటారని అర్థం. అందుకే సరైన రీతిలో ఆహారం తీసుకోకపోతే వీళ్లలో తీవ్రమైన రక్తహీనత (అనీమియా) కలగవచ్చు. రక్తం పట్టడం కోసం వీళ్లు తీసుకోవాల్సిన ఆహారాలూ, పాటించాల్సిన జాగ్రత్తలివి... 

ఇవి తింటే మేలు
►ఐరన్‌ ఎక్కువగా ఉండి, సులభంగా జీర్ణమయ్యే పౌష్టికాహారం తీసుకోవాలి. ఈ ఆహారంలోనూ... ముదురాకుపచ్చగా ఉండే పాలకూర, బచ్చలి, గోంగూర, తోటకూర వంటి ఆకుకూరలు తినాలి.
►పచ్చి బఠాణీలు, చిక్కుళ్ల వంటి పప్పుదినుసులు తీసుకోవాలి.
►క్యారట్, బీట్‌రూట్‌ వంటి దుంపలు రక్తం పట్టడానికి బాగా తోడ్పడతాయి.

►మాంసాహారం తీసుకునేవారు కాలేయం, గుడ్లు ఎక్కువగా తీసుకుంటే అందులోని హీమ్‌ ఐరన్‌ వల్ల త్వరగా రక్తంపడుతుంది.
►ఎండు ఖర్జూరం, బాదం వంటి డ్రైఫ్రూట్‌ తీసుకోవాలి.
►అటుకులు, బెల్లం, పల్లీపట్టీ, తేనె వంటివి తీసుకోవచ్చు. అయితే వీటిని పరిమితంగా తీసుకోవడంతో పాటు, డయాబెటిస్‌ ఉన్నవారు డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే వాటిని తీసుకోవడం మంచిది. 

పరీక్ష చేయించుకోవాలి
రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు తరచూ కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (హీమోగ్రామ్‌) అనే రక్తపరీక్ష చేయించుకుంటూ తమది స్వల్ప, ఓ మోస్తరు లేదా తీవ్రమైన రక్తహీనతా అన్న విషయం తెలుసుకుని, అది ఏ కారణం వల్ల వచ్చిందో దానికి అవసరమైన చికిత్స తీసుకోవాలి. అలాంటి అవసరం ఉన్నవారు ఐరన్‌ మాత్రలు, మరీ ఎక్కువ అవసరం ఉన్నవారు రక్తం ఎక్కించుకోవడం వంటి చికిత్సలు తీసుకోవాలి. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కోసం మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

చదవండి: Psychology: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్‌! టీనేజ్‌ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి
Amla Tea Benefits: ఉసిరి టీ తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

మరిన్ని వార్తలు