Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్‌నర్‌కు సంబంధించి

15 Oct, 2022 17:02 IST|Sakshi

డాక్టర్‌ సలహా

మాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. పిల్లల్లేరు. టెస్ట్స్‌ చేయించుకుంటే మా వారికి స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువ అని తేలింది. డాక్టర్లు ఐవీఎఫ్‌ సూచించారు. మావారి స్పెర్మ్‌ కౌంట్‌ తగినంత లేదు కాబట్టి.. డోనర్‌ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందా? వివరించగలరు – జి. మాలిని, బెంగళూరు

Sperm Donor: స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉంటే కౌంట్‌ను పెంచడానికి కొన్ని మందులను డాక్టర్‌ సూచిస్తారు. అవి వాడిన మూడు నెలల తర్వాత మళ్లీ స్పెర్మ్‌ కౌంట్‌ను చెక్‌ చేస్తారు. అయితే అరుదుగా కొన్ని కేసెస్‌లో స్పెర్మ్‌ కౌంట్‌ చాలా తక్కువగా అంటే మంచి స్ట్రక్చర్‌ లేని స్పెర్మ్‌ ఉన్నప్పుడు వాటి మొటిలిటీ ఆబ్సెంట్‌గా ఉన్నప్పుడు మందులతోటి ప్రెగ్నెన్సీ చాన్సెస్‌ తగ్గుతాయి.

అలాంటి కేసెస్‌లో డోనర్‌ స్పెర్మ్‌ను సజెస్ట్‌ చేస్తారు. చాలాసార్లు స్పెర్మ్‌ డీఎన్‌ఏలో లోపాలు ఉన్నప్పుడు డోనర్‌ స్పెర్మ్‌ను సూచిస్తారు. ఐవీఎఫ్‌ ప్రెగ్నెన్సీలో సక్సెస్‌ రేట్స్‌కి చాలా ఫ్యాక్టర్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ స్పెర్మ్‌ డీటైల్డ్‌ ఎనాలిసిస్‌ విత్‌ డీఎన్‌ఏ ఫ్రాగ్మెంటేషన్‌ స్టడీస్‌ వల్ల స్పెర్మ్‌ మార్ఫాలజీ కనిపెట్టవచ్చు. పదేపదే గర్భస్రావం అవుతుంటే ఈ స్పెర్మ్‌ స్ట్రక్చర్‌లో సమస్య ఉండొచ్చు.

భర్తకు ఏదైనా జెనెటిక్‌ మెడికల్‌ కండిషన్‌ ఉన్నా.. స్పెర్మ్‌ క్వాలిటీ తగ్గినా.. డోనర్‌ స్పెర్మ్‌ను సూచిస్తారు. స్పెర్మ్‌ డోనర్స్‌ స్క్రీనింగ్‌ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది. అని వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. స్పెర్మ్‌ 750 శాతం మొటైల్‌ 74 శాతం నార్మల్‌ మార్ఫాలజీ ఉండి కౌంట్‌ 39 మిలియన్ల కంటే ఎక్కువ ఉండి, స్పెర్మ్‌ కాన్సన్‌ట్రేషన్‌ 15 మిలియన్ల కంటే ఎక్కువ ఉండి, డీఎన్‌ఏ ఫ్రాగ్మెంట్స్‌ 30 శాతం కంటే తక్కువ ఉంటే  డోనర్‌ స్పెర్మ్‌ అవసరం ఉండదు.  

చదవండి: Postpartum Care- Fitness: బిడ్డల్ని కనే సమయాన్ని వాయిదా వేయనక్కర్లేదు! ఇవి పాటించడం వల్ల ప్రసవం తర్వాత కూడా..
థైరాయిడ్‌ ఉన్న వారికి, అబార్షన్స్‌ అయిన మహిళలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం! జాగ్రత్త

మరిన్ని వార్తలు