పేల బాధ తగ్గాలంటే.. 

28 Jan, 2021 14:33 IST|Sakshi

సాధారణంగా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య పేల బాధ. ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్ధాలతోనే వాటి నుంచి విముక్తి పొందే చిట్కాలు మీకోసం.

  • పేల నివారణకు వెల్లుల్లి అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి, దానికి కాస్త నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మునివేళ్లతో చిన్నగా మర్ధన చేయాలి. గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయించి.. చిక్కుదువ్వెనతో దువ్వాలి. అప్పుడు పేలు మొత్తం రాలిపోతాయి. 
  • వేపాకు మెత్తగా నూరి.. అందులోకి రెండుచుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ కలిపి.. జుట్టు కుదుళ్లకు పట్టించాలి. గంట తరువాత స్నానం చేయాలి. 
  • తెల్ల ఉల్లిగడ్డలు కూడా పేలను తగ్గించేవే. ఈ ఉల్లితో రసం తీసి తలకు పట్టించాలి. గంట తరవాత స్నానం చేయాలి. రోజు మార్చి రోజు పది రోజుల పాటు చేస్తే పేలు తగ్గుతాయి. 
  • బాదం పప్పులను ఒకరోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిపైనున్న తొక్కను తీసేసి.. మెత్తటి పేస్టులా రుబ్బుకోవాలి. అందులోకి రెండుమూడు స్పూన్ల నిమ్మరసం కలిపి. జుట్టు కుదుళ్లకు పట్టించాలి.
  • వేపగింజల నూనె మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తీసుకుని తలకు పట్టించవచ్చు. లేదంటే వేపనూనెకు షాంపూను కలిపి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు. 
  • ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను తలకు పూసుకుంటే పేలను తొలగించడమే కాకుండా.. జుట్టు కుదుళ్లకు అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. 
  • గోరువెచ్చని కొబ్బరినూనె, బాదం నూనెలను తలకు పట్టించి, పొద్దున్నే తలస్నానం చేసి, దువ్వెనతో దువ్వాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండడం వల్ల తలలో పేలు చేరకుండా ఉండడమే కాకుండా, జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి. 
మరిన్ని వార్తలు