Health Tips: గ్యాస్ట్రిక్‌ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా?

5 May, 2022 15:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గుండెనొప్పిగా అనిపిస్తోందా?  అది గ్యాస్‌ సమస్య కావొచ్చు!

నవీన్‌కి ఒకరోజున ఉన్నట్టుండి గుండె నొప్పిగా అనిపించింది. కంగారు వేసింది. వెంటనే డాక్టర్‌ దగ్గరకు పరుగు తీశాడు. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి భయపడాల్సిన పనేమీ లేదని, గ్యాస్ట్రిక్‌ ట్రబులేననీ చెప్పి పదిరోజులపాటు రోజూ పొద్దున్నే ఖాళీ కడుపుతో పాంటాప్రజోల్‌ టాబ్లెట్‌ ఒకటి వేసుకోమని, కొంతకాలం పాటు పులుపులు, పప్పులు, మసాలాలకు దూరంగా ఉంటే అదే తగ్గిపోతుందని చెప్పారు. 

కొన్నిసార్లు గ్యాస్ట్రిక్‌ నొప్పి వస్తే, గుండెనొప్పిలాగా అనిపిస్తుంది కదా. ఈ రెండిటికీ మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? దీనికి ప్రథమ చికిత్స ఏమిటి?
►గ్యాస్‌ నొప్పి కూడా ఛాతీ లో రావడం వల్ల గుండె నొప్పి ఏమో అనుకోవడం సహజం. అయితే కొద్దిపాటి పరిశీలనతో తేడాని గుర్తించవచ్చు.
►గుండె నొప్పి అయితే ఛాతీతో పాటు ఎడమ చెయ్యి ఎడమ వైపు బ్యాక్‌ అంతా ఒకేసారి నొప్పి ఉంటుంది.ఛాతీ అంతా బరువుతో కూడిన నొప్పి ఉంటుంది.
►ఇక గ్యాస్‌ నొప్పి మనం వేలుతో పాయింట్‌ చేసేంత ప్లేస్‌లోనే ఉంటుంది. అది కూడా ఓసారి ఓ దగ్గర ఇంకోసారి ఇంకో దగ్గర ఉంటుంది.
►మరొక ముఖ్యమైన విషయం ముందుకు వంగి నప్పుడు కూర్చున్నప్పుడు ఛాతీలో ఉండే నొప్పి పడుకున్నప్పుడు వీపు భాగంలో ఉంటుంది.

►ఎందుకంటే గ్యాస్‌ పడుకున్నప్పుడు వెనక్కి వెళ్తుంది. కానీ గుండె నొప్పి పడుకున్నా లేచినా ఒకేచోట ఉంటుంది.
►అలా అనిపించినప్పుడు రెండు గ్లాసుల పల్చటి మజ్జిగ తాగాలి. అప్పుడు కడుపులోని గ్యాస్, తేన్పుల రూపంలో బయటకి వస్తుంది.
►ఒకవేళ అలా తగ్గకపోతే గ్లాసుడు నీళ్లలో ఈనో పాకెట్‌ కలుపుకు తాగండి. ఫైబర్‌ ఎక్కువగా ఉండే బీరకాయల లాంటి కూరగాయలు తినండి.  
►పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగుతూ ఉంటే కొద్దిరోజులకు గ్యాస్‌ సమస్య తగ్గిపోతుంది.
►రోజు పొద్దున్నే పరగడుపున గ్లాసుడు నీళ్లలో అర చెంచాడు జీలకర్ర వేసి మరిగించి, గోరువెచ్చగా అయ్యాక తాగాలి.  

చదవండి👉🏾: Hair Care Tips: వాల్‌నట్స్‌ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ వల్ల

మరిన్ని వార్తలు