Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే..

13 Nov, 2022 11:59 IST|Sakshi

అనారోగ్యానికి దుడ్డుకర్ర జీలకర్ర

Jeelakarra- Health, Beauty Benefits In Telugu: ప్రతి ఇంటి పోపులపెట్టెలో తప్పనిసరిగా ఉండే జీలకర్ర ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. బహుశ దీనిని గుర్తించబట్టే కాబోలు, పెద్దలు తిరగమోతలో జీలకర్రను చేర్చడం అలవాటు చేసి ఉంటారు. జీలకర్రను పోపు వరకే పరిమితం చేయడం వల్ల పరిమిత ప్రయోజనాలే ఉంటాయి. దానిని సరైన విధంగా వాడితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం. 

►రోజూ పరగడుపున జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని తాగితే  రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. 
రక్తహీనతను రానివ్వదు
►రక్తంలో హీమోగ్లోబిన్‌ తయారవటానికి కావలసిన ముఖ్యపోషకమైన ఐరన్‌ని పుష్కలంగా కలిగి ఉంటుంది.
►శరీరంలో ఐరన్‌ తగ్గటం వల్ల అనీమియా వస్తుంది, ఇది ఎక్కువగా పిల్లలలో, ఆడ వాళ్ళలో, యక్తవయస్సు వాళ్ళలో ఎక్కువగా వస్తుంది.
►ఆహారంలో జీలకర్రని కలుపుకోవటం వలన ఐరన్‌’ని పొందవచ్చు.

జీర్ణక్రియకు
►జీలకర్ర నీటిని తాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది. గ్యాస్, అసిడిటీ, 
►అజీర్తి, కడుపులో వికారం, కడుపులోని అల్సర్లు వదిలిపోతాయి. కడుపులో నులి పురుగులు చనిపోతాయి.
►కిడ్నీలోని రాళ్లు కరుగుతాయి

చర్మ వ్యాధులకు
►జీలకర్రలో విటమిన్‌ ‘ఈ’ అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగానూ, ప్రకాశవంతంగాను చేస్తుంది.
►జీలకర్ర లేహ్యన్ని ముఖానికి పూసుకోవటం వల్ల మొటిమలు, గజ్జి, సోరియాసిస్‌ వంటి చర్మ వ్యాధులను త్వరగా తగ్గిస్తుంది.

జుట్టు రాలకుండా చూడడంలో...
►జీలకర్ర వాడకం బట్టతలని, జుట్టు రాలిపోవటాన్ని తగ్గిస్తుంది.
►ఆలివ్‌ ఆయిల్, జీలకర్ర ఆయిల్‌ సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి జుట్టుకి రాయటం వలన వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. 

నెలసరి క్రమబద్ధం
►నెలసరిని క్రమంగా వచ్చేలా చేయడంతోపాటు నెలసరిలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది.
►దీనిలో ఉండే యాంటీ–ఆక్సిడెంట్‌ గుణాల వల్ల శరీరం రుతుక్రమ సమయంలో ఇబ్బందులకు తట్టుకోగలుగుతుంది.

రోగ నిరోధక శక్తి
►జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ–ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మలినాలను, ఫ్రీ–రాడికల్స్‌’ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
►దీనివల్ల దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు దరిజేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు
►జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
►సుఖనిద్ర కోరుకొనే వారు జీలకర్ర నీటిని సేవించడం ఉత్తమం.
►జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపు లో ఉంటుంది.

►దీంతో రక్తసరఫరా మెరుగు పడటమే గాక రక్తనాళాల్లోని అడ్డంకులు తొలగి గుండె సమస్యలు రావు.
►మధుమేహులు జీలకర్ర నీరు తాగితే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు
►ఇన్ని ప్రయోజనాలున్న జీలకర్రను చిన్నచూపు చూడకుండా విరివిగా ఉపయోగించడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండగలం. 
నోట్‌: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!

చదవండి: Athiya Shetty: బొప్పాయి గుజ్జు, రోజ్‌ వాటర్‌.. పార్టీకి వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా! నా బ్యూటీ సీక్రెట్‌
Eye Problems: ప్రమాద సంకేతాలు.. ఉబ్బిన కళ్లు, రెప్పల మీద కురుపులు.. ఇంకా ఇవి ఉన్నాయంటే

మరిన్ని వార్తలు