Health Tips: రోజూ కనీసం ఒక ఆపిల్‌ తినాలా.. మరి ఆ పేషంట్ల సంగతేంటి?!

30 Sep, 2021 08:03 IST|Sakshi

హెల్త్‌ టిప్‌

Benefits Of Eating Apple: పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహం, మానసిక, గుండె సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. రోజుకో ఆపిల్‌ తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని ఎన్నాళ్లుగానో వింటున్నాం. పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజలవణాలు ఆపిల్స్‌లో పుష్కలంగా ఉండడం వల్లే ఈ మాట వాడుకలో ఉంది. 

గుండె సంబంధిత సమస్యల ముప్పుని తగ్గించుకోవాలంటే రోజూ కనీసం ఒక ఆపిల్‌ తినాలి. దీనిలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. 

అంతేగాక రక్తపీడనాన్ని అదుపులో ఉంచడానికి తోడ్పడి హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఆపిల్‌ నివారిస్తుంది. 

మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు అని తర్జనభర్జన పడుతుంటారు. ఇటువంటి వారు ఆపిల్స్‌ను నిరభ్యంతరంగా తినవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 

మధుమేహం ఉన్నవాళ్లు ఆపిల్‌ తినడం వల్ల టైప్‌–2 డయాబెటీస్‌ ఏడు శాతం తగ్గుతుంది.

 

ఆపిల్‌ తినడం వల్ల మానసిక సమస్యలు దరిచేరవు. ఆపిల్‌లో ఉన్న క్వెర్సెటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక సమస్యలు రానివ్వదు. 

అందుకే రోజూ ఆపిల్స్‌ తినేవాళ్లలో ఆల్జీమర్స్, డిమెన్షియా(మతిమరుపు) వచ్చే అవకాశాలు తక్కువ.

మరిన్ని వార్తలు