Health Tips: షుగర్‌ పేషెంట్లు ఈ పండ్లను తినకపోవడమే మంచిది! ఇవి తినొచ్చు!

17 Sep, 2022 08:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా పండ్లు ఎవరికైనా మంచిదే. ఎందుకంటే పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్నిరకాల పండ్లు బొత్తిగా మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండేవి.

వీటికి దూరంగా ఉండండి!
ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. పైనాపిల్, సీతాఫలం, అరటి, సపోటా, మామిడి పండ్లలో అధికమొత్తంలో చక్కెర ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఇవి దోరగా ఉన్నపుడు తినొచ్చు!
జామ, బొప్పాయి, అరటి వంటి వాటిని బాగా పండినవాటికంటే దోరగా ఉన్నవి మంచిది.

ఇవి ఎలా తిన్నా ఓకే!
నేరేడు పళ్లు, కివీ పండ్లు ఎలా తిన్నా చెరుపు చేయవు. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది.
అలాగే క్యారట్, బీట్రూట్లలోనూ, ఇతర దుంప కూరలలోనూ బీట్రూట్‌తో పోల్చితే మధుమేహులకు క్యారట్లే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.

చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్‌ వల్ల..
Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్‌ చేసుకోవాలి?

  

మరిన్ని వార్తలు