Health Tips: వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్‌మిస్‌లు తరచుగా తింటే...

22 Sep, 2021 12:52 IST|Sakshi

ఉత్సాహంగా.. ఉల్లాసంగా 

మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్యాల బారినపడడమేగాక, ఏ పనిచేయక పోయినా అలసిపోతాము. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు ప్రయత్నించండి. ఉత్సాహంగా ఉంటారు. 

ఉడకపెట్టిన వేరుశనగ విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన వాటిని తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుకరిగి, హృదయ సంబంధ సమస్య ల ముప్పు తగ్గుతుంది. బరువు కూడా నియంత్రణ లో ఉంటుంది. 

ఖర్జూరాలను పాలల్లో ఉడక బెట్టి తినాలి. దీనివల్ల రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది.


దీనిలో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్స్, జింక్‌ పుష్కలంగా ఉంటాయి. 

ఎప్పుడూ నీరసంగా అనిపించేవారు.. రాత్రంతా కిస్‌మిస్‌లను నీళ్లలో నానబెట్టుకుని ఉదయం ఆ నీటిని తాగాలి.

క్రమం తప్పకుండా కొద్దికాలం పాటు ఇలా చేస్తే శరీరంలో నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి.

మధుమేహం ఉన్నవారు కివి, చెర్రీ, పియర్, యాపిల్, ఆవకాడోలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నీరసం దరిచేరదు.

చదవండి: Skin Care Tips: డ్రైఫ్రూట్స్‌, గుడ్లు, చేపలు తిన్నారంటే..

మరిన్ని వార్తలు