Healthy Food To Eat At Night: రాత్రి భోజనంలో ఇవి తిన్నారంటే... చక్కటి నిద్ర!

2 Jul, 2022 13:52 IST|Sakshi

డిన్నర్‌లో ఏం తింటామో వాటిపై మన రాత్రి నిద్ర ఆధారపడి ఉంటుంది. చాలామంది రకరకాల ఫుడ్స్‌ తిని అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. జీర్ణక్రియకు భంగం కలిగించే ఆహారాన్ని తింటే ఉదయాన్నే పొట్టను క్లియర్‌ చేయడంలో సమస్య ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

తొంభైశాతం సరైన ఆహారం ఎంచుకోకపోవడం వల్ల రాత్రి నిద్ర పాడవుతుంది. అయితే రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మీ విందు చాలా తేలికగా, జీర్ణమయ్యేలా ఉండాలి. అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపు లో భారం గా ఉండకూడదు.  డిన్నర్‌లో తినే ఆహార పదార్థాలు గ్యాస్‌ ఉత్పత్తి చేయకూడదు.

ఎందుకంటే ఇది నిద్రిస్తున్నప్పుడు కడుపు నొప్పికి కారణమవుతుంది. అంతేకాదు నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. డిన్నర్‌ చాలా కారంగా కూడా ఉండకూడదు. ఇది డీహైడ్రేషన్‌ సమస్యని సృష్టిస్తుంది. రాత్రి తరచుగా దాహం ఉండవచ్చు.

రాత్రి భోజనంలో తేలికపాటి సుగంధ ద్రవ్యాలు, ఆవుపాలతో తయారు చేసిన దేశీ నెయ్యిని ఉపయోగించాలి. ఓట్స్‌ లేదా శనగ పిండితో చేసిన ఆహారాలని ఉపయోగించవచ్చు. పప్పు, చపాతీ అన్ని విధాలా బాగుంటుంది. అలాగే బ్రోకలీ, కొబ్బరి, పుదీనా ఉపయోగించిన వంటకాలు సులభంగా జీర్ణమవుతాయి. 

చదవండి: Health Tips: నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు! ఇవి తింటే మేలు!

మరిన్ని వార్తలు