Health Tips: ఆయాసంతో బాధపడుతున్నారా? గురక సమస్య వేధిస్తోందా?.. ఇక పాలకూర వల్ల..

24 Sep, 2022 09:50 IST|Sakshi

Health Tips: ఆయాసం ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు.
►రెండు చిటికల పసుపు, చిటికడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది.
►వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి తాగడం చాలా మంచిది.
►ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది.

►అదే విధంగా లేత ముల్లంగి, వెలగపండు, తేనె వెల్లుల్లి తీసుకోవడం మంచిది.
►అయితే  మినుములు, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఐస్‌ క్రీములు, కూల్‌ డ్రింక్స్, చన్నీటి స్నానం, మంచులో లేదా చల్లటి గాలిలో తిరగడం మంచిది కాదు. అయితే, శరీర ధర్మాలను బట్టే వీటిని అనుసరిస్తే మేలు.

గురక తగ్గాలంటే..
►నిమ్మరసం రోజు తాగటం వలన మ్యూకస్‌ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది.
►ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వలన రాత్రి కలిగే ఈ గురకల నుండి ఉపశమనం పొందుతారు.
►అంతేకాకుండా, చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది. 

పాలకూర తరచూ తింటే..
►పాలకూర రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయ పడుతుంది.
►పాలకూర తరచు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది.
►దీంతో హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
►జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్‌ చేయలేకపోతున్నారా? ఇవి తింటే..

మరిన్ని వార్తలు