Magnesium Deficiency: ఇది లోపిస్తే కిడ్నీలు పాడవుతాయి.. ఇంకా! ఇవి తింటే మేలు! కానీ ఎక్కువైతే..

25 Jun, 2022 09:53 IST|Sakshi

ఆకలి లేదా? నిద్ర సరిగ్గా పట్టట్లేదా?... మెగ్నీషియం లోపం కావచ్చు

Health Tips In Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎ, బి, సి, డి, ఈ, కె, బీకాంప్లెక్స్, బీట్వెల్వ్‌(బీ12) వంటి విటమిన్లు ఏవిధంగా అవసరమో, అదేవిధంగా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్‌ కూడా అవసరం. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి.

కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్‌ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. 

మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!!
సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి.
ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి.
శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు.

లక్షణాలు..( Magnesium Deficiency Symptoms)
మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు.
వికారంగా ఉంటుంది.
వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది.
నీరసంగా ఉంటారు.
హార్ట్‌ బీట్‌రేట్‌ లో హెచ్చుతగ్గులు వస్తాయి.
కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది.
కండరాలలో నొప్పి వస్తుంది.
ఒత్తిడి పెరుగుతుంది.
నిద్ర సరిగ్గా పట్టదు.
అధిక రక్తపోటు వస్తుంది.
ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది.

మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!! (Magnesium Rich Foods)
ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్‌ బెర్రీస్, ఫిగ్స్‌ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది.
అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది.
బ్రౌన్‌ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది.

మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి.


డార్క్‌ చాక్లెట్‌ తిన్నా ఫలితం ఉంటుంది.
మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు.
సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

ఎక్కువైతే..?
మెగ్నీషియం ఎక్కువైనా కూడా ఇబ్బందులు తప్పవు.
కడుపునొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది.
మెగ్నీషియం ఎంత అవసరమో అంతే ఉండేలా చూసుకోవాలి.

లోపించినా ప్రమాదమే; ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. 
చదవండి: Vitamin D Deficiency: విటమిన్‌- డి.. ఆ హార్మోన్‌ ఉత్పత్తికి ఇది అవసరం!
Vitamin C Deficiency: విటమిన్‌ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు!

మరిన్ని వార్తలు