Health Tips In Telugu: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు!

15 Sep, 2021 10:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హెల్త్‌ టిప్స్‌

అనేక ఆరోగ్య సుగుణాలు ఉండడం వల్ల అలోవెరాను సూపర్‌ ఫుడ్‌గా పరిగణిస్తారు. దీనిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండడంతో జ్యూస్‌ చేసుకుని తాగుతుంటారు. అయితే అలోవెరా జ్యూస్‌ను కొన్ని రకాల సమయాల్లో తాగకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఆ సందర్భాలేంటో చూద్దాం...

గర్భం దాల్చిన మహిళలు అలోవెరా జ్యూస్‌ జోలికి పోకపోవడమే మంచిది. తల్లికాబోతున్న స్త్రీలు ఈ జ్యూస్‌ తాగడం వల్ల గర్భాశయం సంకోచానికి గురై గర్భస్రావం అయ్యే అవకాశాలున్నాయి.
దీనిలోని అంథ్రోక్వినోన్‌  వల్ల కడుపు నొప్పి, డయేరియా సంభవిస్తాయి. అందువల్ల గర్భిణులు ఈ జ్యూస్‌ తాగాలనుకుంటే మాత్రం డాక్టర్‌ని తప్పకుండా సంప్రదించాలి.


అలోవెరా జ్యూస్‌ శరీరంలోని పొటాషియం స్థాయులను తగ్గిస్తుంది. ఫలితంగా క్రమరహిత హృదయ స్పందనలు ఏర్పడి కండరాలను బలహీనపరుస్తాయి.
మంచిది కదా అని అతిగా అలోవెరా జ్యూస్‌ తాగితే కిడ్నీ సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.


అందువల్ల ఒక్క అలోవెరా జ్యూస్‌ అనే కాదు... ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి కదా అని ఏది పడితే అది అతిగా తాగేయడం మంచిది కాదు.  

చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే..

మరిన్ని వార్తలు