Health Tips In Telugu: రాజ్‌గిరతో ఆరోగ్యం.. పాలతో అరటిపండు కలిపి తింటే

15 Sep, 2021 16:57 IST|Sakshi

రాజ్‌గిర గింజలతో ఆరోగ్యం

Rajgira: దాదాపు 10 నుంచి 12 గంటల విరామం తరువాత ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటాము. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే పోషకాలు బరువును నియంత్రణలో ఉంచడంలోనూ, మధుమేహం, రక్తపీడనాన్ని అదుపులో ఉంచడంలోనూ తోడ్పడతాయి. అందువల్ల రాజ్‌గిరా లేదా రమదానా అని పిలిచే మిల్లెట్స్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందుతాయి.

వీటిని అల్పాహారంగా తీసుకోవడం వల్ల రక్తపీడనం, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. పాలతో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అరటిపండుతో కలిపి తింటే మరిన్ని ప్రయోజనాలు. ప్రోటీన్, పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల ఇవి తింటే కడుపునిండిన భావన కలుగుతుంది. దీంతో అధిక బరువు కూడా తగ్గుతుంది. 

చదవండి: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు!
Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్‌ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!!

మరిన్ని వార్తలు