High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్‌, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్‌- డి పుష్కలం!

4 Jun, 2022 10:10 IST|Sakshi

మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్‌- డి కూడా ఒకటి. ఈ ‘సన్‌షైన్‌ విటమిన్‌’ లోపిస్తే ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది.  పిల్లల్లో రికెట్స్‌ వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ లోపాలను అధిగమించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సరి!  వీటిలో విటమిన్‌- డి పుష్కలం.

ఈ ఆహారాల్లో లభిస్తుందం’డి’
పుట్టగొడుగుల్లో ‘విటమిన్‌–డి’ ఎక్కువగా ఉంటుంది.
గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్‌–డి’ లభిస్తుంది.
పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమద్ధిగా ఉంటాయి.
ట్యూనా, సాల్మన్‌ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్‌–డి సమృద్ధిగా ఉంటుంది.
జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్‌–డి’కి మంచి వనరులు.
చలికాలంలో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత విటమిన్‌ డి లభిస్తుంది.
అలాగని ఎండాకాలంలో ఎప్పుడూ ఏసీగదుల్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు శరీరానికి ఎండ తగలనివ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎండలోనే ఉందండీ మరి!

చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్‌- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్‌ ఉత్పత్తికి ఇది అవసరం!
Vitamin C Deficiency: విటమిన్‌ ‘సి’ లోపిస్తే జరిగేది ఇది.. ఇవి తింటే మేలు!

మరిన్ని వార్తలు