Lady Finger Health Benefits: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా మెదడు..

18 Nov, 2022 17:39 IST|Sakshi

Lady's Finger Health Benefits In Telugu: బెండకాయ వేపుడు.. బెండకాయ పులుసు.. బెండకాయ 65.. బెండకాయ కూర.. వంటకం ఏదైనా అందులో బెండీ ఉంటే చాలు లొట్టలేసుకుని భోజనం లాగించేస్తారు. కేవలం నోటికి రుచిగా ఉండటం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది బెండకాయ. మరి అవేమిటో తెలుసుకుందామా?!

బెండకాయ(100 గ్రాములు)లో లభించే పోషకాలు
►కార్బోహైడ్రేట్స్‌- 7.45 గ్రా.
►ప్రొటీన్‌- 1.93 గ్రా. 
►ఫ్యాట్‌- 0.19 గ్రా.
►ఫైబర్‌- 3.2 గ్రా.
►షుగర్‌- 1.48 గ్రా.

►వాటర్‌- 89.6 గ్రా.
►ఎనర్జీ- 33 కిలోకాలరీలు
►స్టార్చ్‌- 0.34 గ్రా.
►సోడియం- 7 మిల్లీ గ్రాములు
►పొటాషియం- 299 మిల్లీ గ్రాములు

►ఐరన్‌- 0.62 మిల్లీ గ్రాములు
►మెగ్నీషియం- 57 మిల్లీ గ్రాములు
►కాల్షియం- 82 మిల్లీ గ్రాములు
►ఫాస్పరస్‌- 61 మిల్లీ గ్రాములు

►కాల్షియం- 82 మిల్లీ గ్రాములు
►జింక్‌- 0.58 మిల్లీ గ్రాములు
►మాంగనీస్‌- 0.788 మిల్లీ గ్రాములు
►కాపర్‌- 0.109 మిల్లీ గ్రాములు
►సెలీనియం- 0.7 మిల్లీ గ్రాములు
►వీటితో పాటు విటమిన్‌ ఏ, బీ1, బీ2, బీ3, బీ5, బీ6, సీ, ఈ, కే కూడా ఉంటాయి.

బెండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు
►బెండకాయ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. బెండ గింజలు, తొక్కలోని ఎంజైమ్‌లు ఇన్సులిన్‌ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. కాబట్టి షుగర్‌ పేషెంట్లు వారానికోసారయినా బెండకాయ తినడం మంచిది.

►బెండకాయలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఇది దోహదం చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. కొంచెం తిన్నా కావాల్సి శక్తి లభిస్తుంది. కాబట్టి ఊబకాయంతో బాధపడే వారికి బెండీ ప్రయోజనకరం.

►బెండకాయ తింటే అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
►ఇక చెడు కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు బెండకాయలో ఉన్నాయి.

పెద్ద పేగు క్యాన్సర్‌.. ఇంకా
►బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి దోహదపడతాయి.
►అలాగే కాన్సర్‌ నిరోధక కారకాలు కూడా అధికం. పెద్ద పేగు క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నివారణలో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.

►దంతక్షయంతో బాధపడే వారు బెండకాయను తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.

గర్భవతులు తింటే
►బెండకాయలో ఐరన్‌ అధికం. గర్భవతులు బెండకాయ తినడం వల్ల బిడ్డకు మేలు జరుగుతుంది. ఫోలేట్ సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇక ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. 

మెదడు ఆరోగ్యం మెరుగుపరిచి
►బెండకాయలో ప్రొబయాటిక్స్‌ కూడా ఎక్కువే. ఆరోగ్యానికి దోహదం చేసే బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. 
►బెండకాయలోని ఫ్లేవనాయిడ్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడు పనితీరుపై ప్రభావం చూపడం సహా.. జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో దీనిది కీలక పాత్ర అని నిపుణులు అంటున్నారు.

►అదే విధంగా చర్మకాంతి మెరుగుపడడానికి బెండకాయ దోహదం చేస్తుంది.
►ఇందులోని కాల్షియం ఎముకలను పటిష్టం చేయడంలో ఉపయోగపడుతుంది.
నోట్‌: ఆ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే శరీరానికి ఏవి సరిపడతాయో వాటినే తినాలి.

బెండకాయ 65 తయారీకి కావలసినవి: 
►బెండకాయలు – అర కిలో
►అల్లం – చిన్న ముక్క
►పచ్చి మిరపకాయలు – 4
►వెల్లుల్లి రెబ్బలు – 4
►సెనగ పిండి – పావు కప్పు
►బియ్యప్పిండి – పావు కప్పు

►జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
►మిరప కారం – ఒక టీ స్పూను
►ఉప్పు – తగినంత
►పల్లీలు – పావు కప్పు
►గరం మసాలా – అర టీ స్పూను
►పచ్చి కొబ్బరి – పావు కప్పు.

తయారీ:
►అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
►బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
►ఒక పళ్లెంలో బెండకాయ ముక్కలు, సెనగ పిండి, బియ్యప్పిండి, జీలకర్ర పొడి, మిరప కారం, కొద్దిగా నీళ్ళు వేసి కలపాలి

►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు వేసి డీప్‌ ఫ్రై చేసి పక్కన ఉంచాలి.
►అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి
►అదే నూనె మరోసారి కాగాక బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, మీడియం మంట మీద సుమారు పావు గంట సేపు  వేయించి దింపాలి
►గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు , పచ్చి కొబ్బరి తురుము ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా కలపాలి.

చదవండి: Veginal Infections: పబ్లిక్‌ టాయిలెట్స్‌ వాడటం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయా? నిజానికి టాయిలెట్‌ సీట్‌పై ​కంటే

మరిన్ని వార్తలు