Back Walking Benefits: వెనక్కు నడవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలివే! ప్లాంటార్‌ ఫేసిౖయెటిస్‌తో వచ్చే మడమల నొప్పి..

5 Dec, 2022 13:07 IST|Sakshi

Walking Backwards- Health Benefits: వెనక్కు నడవడం లెక్కకు తిరోగమన సూచనగా కనిపిస్తుందేమోగానీ... హెల్త్‌కు చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనకలవాటైన నడక కంటే వెనక్కు నడిచే ప్రక్రియ మరింత సవాలుగా మారుతుంది. మెదడుకు మరింత ఎక్కువ పని పడుతుంది. బ్యాలెన్స్‌ చేయడం, నడిచేప్పుడు కాళ్లు సరిగ్గా పడటం, పక్కలకు సరిగా తిరగడం వంటి వాటి నియంత్రణ మరింత కష్టమవుతుంది.

40 శాతం శక్తి ఎక్కువగా
దాంతో దేహానికీ, మెదడుకూ శ్రమ పెరిగి, శారీరక కదలికలు చురుకుగా మారడానికి, మెదడుకు మరింత పదును పెరగడానికి అవకాశముంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. మామూలు నడకతో పోలిస్తే వెనక్కు నడవడంలో 40 శాతం శక్తి ఎక్కువగా వినియోగమవుతుందని, దాంతో అంతే సమయంలో మరింత ఎక్కువ వ్యాయామం సమకూరుతుందనీ, లంగ్స్‌కు ఆక్సిజన్‌ కూడా పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఆరోగ్య ప్రయోజనాలివే!
వెనక్కి నడక వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌ నివారితం కావడం, కాలి కండరాల బలం, సామర్థ్యం పెరగడం, కీళ్ల ఆరోగ్యం పెంపొందడం, ప్లాంటార్‌ ఫేసిౖయెటిస్‌తో వచ్చే మడమల నొప్పి తగ్గడం, దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడేవారి నొప్పి నుంచి ఉపశమనంతో పాటు వేగంగా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. 

అయితే వెనక్కు నడిచే ఆరోగ్య ప్రక్రియకోసం పరిసరాలతో బాగా పరిచయం ఉన్న గదిలోనే (ఇన్‌డోర్‌లో) అలవాటైన చోట నడుస్తూ, మధ్యన ఎలాంటి అంతరాయాలూ లేకుండా చూసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌కు చెందిన క్లినికల్‌ ఎక్సర్‌సైజ్‌ ఫిజియాలజీ అధ్యాపకుడు జాక్‌మెక్‌ నమారా. 

చదవండి: Menthi Podi: షుగర్‌ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే..
Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్‌ వుమెన్‌లో ఈ సమస్యలు..
Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం

మరిన్ని వార్తలు