Hema Malini: మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్‌.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

5 Dec, 2022 17:01 IST|Sakshi

Hema Malini- Beauty Tips In Telugu: అలనాటి బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌ హేమమాలిని.. డెబ్బై పదుల వయసులోనూ ఆకర్షణీయమైన రూపంతో మెరిసిపోతున్నారు. 70వ దశకంలో బీ-టౌన్‌ ప్రేక్షకులను తన అందం, అభినయంతో మంత్రముగ్ధులను చేసిన ఆమె.. ఇప్పటికీ ‘తార’లా వెలిగిపోతున్నారు. అయితే, 74 ఏళ్ల వయసులోనూ తను ఇలా కనిపించడానికి కారణం అమ్మ చెప్పిన చిట్కాలే అంటూ తన బ్యూటీ సీక్రెట్‌ను ఇటీవల రివీల్‌ చేశారామె.

ఆవిడ ఏం చెప్పారంటే..
‘‘రోజూ ఉదయమే కొబ్బరి నీళ్లు తాగుతాను. వీలైనంత ఎక్కువగా మంచి నీళ్లూ తాగుతాను. అలాగే భోజనంలో పెరుగు తప్పకుండా ఉండాల్సిందే. వీటివల్ల చర్మం తేమను కోల్పోకుండా తాజాగా.. కాంతిమంతంగా ఉంటుంది.

ఇవన్నీ మా అమ్మ చెప్పిన చిట్కాలే. ఈ చిట్కాలతోపాటు రోజూ క్రమం తప్పకుండా డాన్స్, యోగా, సైక్లింగ్‌ చేస్తా. మొహానికి అరోమా ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుంటా. ఇది మొహం మీది ముడతలను మాయం చేసి చర్మాన్ని మృదువుగా.. యంగ్‌గా ఉంచుతుంది!’’ అని హేమమాలిని పేర్కొన్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన హేమమాలిని ప్రస్తుతం బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నారు.

చదవండి: Menthi Podi: షుగర్‌ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే..
Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు