War of the Golden Stool: సరిగ్గా ఇదే రోజు రగిలింది విప్లవాగ్ని...

28 Mar, 2021 08:34 IST|Sakshi

అలనాడు...

బ్రిటీష్‌వారి కన్ను గోల్డ్‌కోస్ట్‌ (ఈనాటి ఘనా)పై పడింది. యుద్ధానికి కాలుదువ్వారు. అయితే బ్రిటిష్‌ ప్రభువులకు అంత తేలిగ్గా ఆ రాజ్యం చేజిక్కలేదు. నాలుగో ప్రయత్నంలో మాత్రమే గోల్డ్‌కోస్ట్‌ను స్వాధీనపరుచుకోగలిగారు. అయితే వారి దృష్టి బంగారు సింహాసనంపై పడింది (పేరుకే ఇది సింహాసనం. పీట సైజులో ఉంటుంది. అందుకే గోల్డెన్‌ స్టూల్‌ అని పిలిచారు)

‘నువ్వెక్కడైనా రాజేకానీ ఇక్కడ మాత్రం కాదు. ఈ సింహాసనంపై కూర్చోడానికి వీలులేదు’ అని ఎదురు తిరిగి ఆ సింహాసనంపై తమకు ఉన్న పవిత్రభావాన్ని, సెంటిమెంట్‌ను చాటుకున్నారు జనాలు. ‘ఆరునూరైనా కూర్చొని తీరుతాను’ అని ఆవేశపడ్డాడు బ్రిటీష్‌ గవర్నర్‌. అంతే...జనం కోసం సైనికులు కాదు జనమే సైనికులై జంగ్‌ సైరన్‌ ఊదారు.

మార్చి 28,1900 లో యుద్ధం మొదలైంది. ఆరునెలల పాటు కొనసాగింది. ఎంతోమంది చనిపోయారు. బలమైన బ్రిటీష్‌ సామ్రాజ్యవాద శక్తి ముందు వారు నిలవలేక పోవచ్చు. కానీ ఆ సింహాసనాన్ని బ్రిటిష్‌వారికి దక్కకుండా, మూడో కంటపడకుండా దాచడంలో విజయం సాధించారు. ఆ తరువాత కాలంలో మాత్రం ఈ సింహాసనంపై ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించారు బ్రిటిష్‌ పాలకులు. చరిత్రలో సామాన్యుడి పోరాటానికి పట్టం కట్టిన ఈ యుద్ధం ‘గోల్డెన్‌స్టూల్‌ వార్‌’గా ప్రసిద్ధి పొందింది.

మరిన్ని వార్తలు