Home Creations: అలంకరణలో ఇదో విధం..!

19 Sep, 2021 12:50 IST|Sakshi

ఉల్లాసరకమైన ఇంటి అలంకరణ ఆ గృహస్తుల అభిరుచిని తెలియజేస్తుంది. కానీ, ‘మరీ ఇంతటి అలంకరణా’ ఆశ్చర్యపోయే ఇంటి లోపలి డిజైన్లు ఇవి. లిథువేనియా వెబ్‌సైట్‌ బోర్డ్‌పాండా ప్రపంచంలో ఉన్న కొన్ని విచిత్రమైన గృహాలంకరణ డిజైన్లను ఇటీవల మన ముందుంచింది. 

వంటగదిలో కంచె
ఇంటి చుట్టూ కంచె వేసినట్టుగా వంటగది అలంకరణ వింతగానే అనిపిస్తుంది. పొయ్యి గట్టును కూడా అలాగే డిజైన్‌ చేయడం వరకు బాగానే ఉంది. కానీ, ఎంత శుభ్రం చేసినా వంటగది గజిబిజిగా ఉన్నట్టు కలలోకి వస్తే మాత్రం ఎవరూ బాధ్యులు కారండోయ్‌. ఇంతకీ ఈ కిచెన్‌ ఎక్కడ అనేది మీ సందేహమా అమెరికాలోని ఓ గృహస్తుడి ఐడియా ఇది. 

బాస్కెట్‌ బాల్‌ నెట్‌
ఇంటి హాలులో అందమైన షాండ్లియర్‌ని వేలాడదీయడం ఒక హంగుగా చూస్తూనే ఉంటాం. అరుదైన క్రిస్టల్స్‌తో బాస్కెట్‌బాల్‌ నెట్‌ను రూపొందించి, ఇలా హ్యాంగ్‌ చేశారు. ఇది నిజంగానే అరుదైన షాండ్లియర్‌గా మార్కులు కొట్టేసింది. 

ఇంట్లో జూ పార్క్‌
సెంటర్‌ టేబుల్‌ పక్కనే మూలన అలంకరించిన షో పీస్‌ చూస్తే ఆ ఇంటి యజమాని గుండె ఎంత గట్టిదో ఇట్టే తెలిసిపోతుంది. మొసలి తన బలాన్నంతా ఉపయోగించి కూర్మాన్ని నోట కరచుకున్నట్టుగా ఉన్న ఈ షో పీస్‌ జూ పార్క్‌లో ఉంటే ఉండచ్చు గాక. కానీ, ఇంటి అలంకరణలో చోటు ఇవ్వడం అనేది అతి పెద్ద విశేషమే. 

కమోడ్‌పై పెయింటింగ్‌
కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్‌ కమోడ్‌పైన క్రాకరీ ఐటమ్స్‌పై ఎలా అయితే డిజైన్‌ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్‌ పట్ల డిజైనర్‌ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. 

స్నానపు తొట్టె కుర్చీలు
పాత బాత్‌టబ్‌ను తీసుకొని, దానిని రెండు కుర్చీలు, ఒక సెంటర్‌ టేబుల్‌ చేయడం అనేది ఒక సృజనాత్మక డిజైన్‌గా మెచ్చుకోకుండా ఉండలేం. అంత సౌకర్యంగా లేకపోవచ్చు కానీ, ఈ డిజైనర్‌కి మాత్రం పర్యావరణం పట్ల అమితమైన ప్రేమ ఉన్నట్టు తెలుస్తోంది. పాడైపోయిన వస్తువులను తిరిగి వాడుకునేలా ఎలా చేయచ్చో ఈ డిజై¯Œ  చూస్తే తెలిసిపోతుంది. 

గడ్డి కుర్చీలు
పార్కులో గడ్డిలో కూర్చోవడం మనందరికీ అనుభవమే. కానీ, ఇంటి లాన్‌లో పచ్చటి గడ్డి పరచుకున్న కుర్చీల మీద కూర్చోవడం ఒకింత తెలియని అనుభూతే. టేబుల్, కుర్చీల మీద ఇలా గడ్డిని అందంగా రూపు కట్టారు. ప్రకృతి అంటే ఎంత ప్రేమ ఇలా చాటి చెప్పారు. 

గగుర్పాటు కప్పులు
టీ తాగడానికి అందమైన కప్పుల సేకరణ అందరూ చేస్తారు. కానీ, గగుర్పాటు కలిగించే విధంగా ఉన్న కాఫీ కప్పుల డిజైన్‌ మాత్రం చూస్తే జడుసుకోకుండా ఉండలేరు. 

స్పైన్‌ క్యాండిల్స్‌
వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్‌ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్‌ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్‌ను కూడా నైస్‌గా క్రియేటివ్‌గా చేస్తున్నారు. 

కమోడ్‌పై పెయింటింగ్‌
కొంతమంది వ్యక్తులు ఇంట్లో ప్రతీది సృజనాత్మకంగా ఉండాలనుకుంటారు. ఓ ఇంటి యజమాని తన టాయిలెట్‌ కమోడ్‌పైన క్రాకరీ ఐటమ్స్‌పై ఎలా అయితే డిజైన్‌ చేస్తారో ఆ విధంగా చేయించాడు. ఆ పెయింటింగ్‌ పట్ల డిజైనర్‌ ఎంత శ్రద్ధ కనబరచారో చూస్తుంటే ఇంటి యజమాని అభిరుచి ఎంతటి ఘనమైనదో మనకు ఇట్టే తెలిసిపోతుంది. 

కాళ్ల కుండీలు
ఎక్కడా లేని విధంగా ప్రత్యేక ఇంటి అలంకరణ కోసం చూస్తున్నారా? అయితే, ఇలా ప్రయత్నించవచ్చు. ఇళ్లలో మొక్కల కుండీలను ఏర్పాటు చేసుకుంటుంటారు. ఈ కుండీ మానవ శరీరం నుంచి ప్రేరణ పొంది డిజైన్‌ చేసింది. మానవ కాళ్ల రూపాలతో తయారుచేసిన కుండీల కంటైనర్‌ ఇది. 

రాక్షస మంచం
భారీ కోరలతో రాక్షస నోరును పోలి ఉన్నట్టు ఉన్న మంచం ఇది. ఈ మంచంలో గాఢమైన నిద్ర కోసం ప్రయత్నించడం అసాధారణ వ్యక్తులకే సాధ్యం అనుకుంటే పొరపాటేమీ కాదు. 

స్పైన్‌ క్యాండిల్స్‌
వివిధ రకాల షేపుల్లో ఉన్న క్యాండిల్స్, రంగుల్లో ఉన్న క్యాండిల్స్‌ గురించి మనకు తెలుసు. కానీ, ఇలా మానవ శరీర వెన్నెముకను పోలి ఉండే క్యాండిల్‌ ను సృష్టించారు. శరీర నిర్మాణ శైలితో ఉన్న రూపకల్పనల అలంకారాలను ఇష్టపడతున్నారట. అందుకే, స్పైన్‌ను కూడా నైస్‌గా క్రియేటివ్‌గా చేస్తున్నారు.

చదవండి: World Alzheimer's Day: మతిమరుపు వల్ల మెదడు బరువు కోల్పోయి.. క్రమంగా..

మరిన్ని వార్తలు