Constipation Home Remedies: మలబద్ధకంతో బాధపడుతున్నారా.. నిర్లక్ష్యం చేస్తే!

27 Mar, 2022 13:46 IST|Sakshi

మలబద్ధకం చాలామందిని వేధించే సమస్య. ఇది కేవలం ఉదయం పూట చెప్పుకోలేని బాధ మాత్రమే కాదు.. దీనివల్ల మున్ముందు కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా కూడా దీన్ని నివారించుకోవాల్సిన అవసరమూ ఉంది. 

పీచు పుష్కలంగా ఉండే ఆహారం, తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం సాధ్యం. అవి జీర్ణాశయమార్గాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు విరేచనం కూడా తేలిగ్గా అయ్యేలా చేస్తాయి. దేహంలో చక్కెరను నెమ్మదిగా వ్యాపించేలా చేసేందుకూ, కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికి దోహదపడతాయి. మనం వాడే అన్ని రకాల ధాన్యాల పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు.. ఉదాహరణకు దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. చిక్కుళ్లలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్‌ కూడా ఎక్కువే.

చదవండి: బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా తెలుసా?

ఇక పండ్ల విషయానికి వస్తే.. పీచు ఎక్కువగా ఉండే బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. ∙పీచుపదార్థాలతో పాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల  (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మేలు చేస్తుందని గ్రహించాలి.
చదవండి: ‘స్టెమీ’ గుండెపోటు అంటే తెలుసా? ఎవరికి ఆ ప్రమాదం?

మరిన్ని వార్తలు