కరోనా సోకకుండా జాగ్రత్తపడటం ఎలా..?

24 Apr, 2021 01:04 IST|Sakshi

ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు కన్పించగానే, టెస్టుల కన్నా ముందే లక్షణాలున్న వ్యక్తి మిగతా కుటుంబసభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉండాలి. సాధారణ జ్వరం, లక్షణాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటే చాలా మంచిది. లక్షణాలున్న వ్యక్తితో సహా కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరూ చేతులు తరచూ శుభ్రం చేసుకుంటుండాలి.

ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్నపిల్లలను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎక్కువమంది గుమిగూడే ప్రాంతాలకు, వేడుకలకు అస్సలు వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల లక్షణాలున్న వ్యక్తికి టెస్టుల అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, చాలావరకు మిగతా కుటుంబసభ్యులకు, ఇతరులకు సోకకుండా ఉంటుంది.

కరోనా సోకిందని తేలిన తర్వాత, స్వల్ప లక్షణాలే ఉన్నా.. ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచే వెసులుబాటు, దూరంగా ఉండే అవకాశం లేకపోతే ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ కేంద్రాలకు పంపించడం మంచిది. కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌లో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ముందు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఒకరికి వస్తే అందరికీ సోకే ప్రమాదం తలెత్తుతోంది. ప్రస్తుతమున్న వైరస్‌ వేరియంట్ల వ్యాప్తి వేగం గతంలో కంటే 50% నుండి 150 % ఎక్కువగా ఉంది. గాలి, వెలుతురు లేని ప్రాంతాల్లో ఇది మరింత వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తం కావడం అనేది చాలా ముఖ్యం.  పై జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. 

- డా. రాజేంద్ర
క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, మమత మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌ 

చదవండి: 
కరోనా భయాన్ని జయించడం ఎలా..?

కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?

కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా?

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు