స్పామ్‌ కాల్స్‌తో ఒళ్లు మండిపోతోందా? ఇలా చేయండి!

1 Apr, 2024 10:18 IST|Sakshi

పొద్దున లేచింది మొదలు రాత్రి వరకూ  స్పామ్‌ కాల్స్‌ బెడద ఇంతా అంతాకాదు. ఏ పనిలో ఉన్నా,ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా.. ఏదో పెద్ద పని ఉన్నట్టు మనల్ని డిస్ట్రబ్‌ చేస్తాయి. తీరా అది స్పామ్‌ అని తెలిసాక మన కొచ్చే   కోపం అంతా కాదు.  

సెలెన్స్‌ అన్‌ నోన్‌ కాలర్స్‌,  స్పామ్‌  కాల్‌ అలర్ట్‌.. ఇలా  ఎన్ని అప్షన్స్‌  ఉన్నా.. ఎన్ని నంబర్లను బ్లాక్‌ చేసినామళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి..దాదాపు సెల్‌ఫోన్‌ ఉన్నప్రతి వారికి ఇది అనుభవమే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌లో ఒక వీడియో  తెగ షేర్‌ అవుతోంది. 

సైన్స్‌గర్ల్‌  అనే ట్విటర్‌ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.   ఈవీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికే ఇది 14 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరి మీరు కూడా ఓ లుక్కేసుకోండి!

Election 2024

మరిన్ని వార్తలు