చుండ్రుకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారా.. ఇవి పాటించండి..

6 May, 2021 19:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సరిగ్గా తల స్నానం చేయకపోవడం... ఇంకా కొన్ని ఇతర కారణాల వల్ల తలలో చుండ్రు పేరుకు పోతుంది. అందువల్ల వారానికి కనీసం రెండు మూడుసార్లు తల స్నానం చేయాలి. మిగతా రోజుల్లో ఆయిల్‌తో మసాజ్‌ చేసుకుని సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తూ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే చుండ్రు తగ్గుతుంది. ఇవి చేస్తూ కింద చెప్పిన సింపుల్‌ చిట్కాలు పాటిస్తే డ్యాండ్రఫ్‌ త్వరగా తగ్గుతుంది.

సింపుల్‌ చిట్కాలు
అరకప్పు మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానపెట్టాలి.  నానిన మెంతులను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని ఈ పేస్టుని తలకు రాసుకోవాలి. నలభై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి.
ఉసిరి, త్రిఫల చూర్ణాన్ని తలకు రాసుకుని ఇరవై నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.
కప్పు కొబ్బరి పాలలో నాలుగు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తల స్నానం చేసేముందు తలకు పట్టించి పదినిమిషాల తరువాత తలను శుభ్రం చేసుకోవాలి. 
ఐదు స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి..దీనిలో నాలుగు స్పూన్ల ఉసిరి పొడి వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టును తలకు రాసుకుని మసాజ్‌ చేసుకోవాలి. 
స్పూను పెసరపొడి, మూడు స్పూన్ల పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంతో తలంటు పోసుకోవాలి. 

వీటిలో ఏదైనా ఒకదానిని వారానికి రెండు మూడు సార్లు పాటించడం వల్ల చుండ్రు బాధ తగ్గుతుంది.  

మరిన్ని వార్తలు