నిద్రలో మెడ పట్టుకుందా?.. అయితే ఇటో లుక్కేయండి

10 Apr, 2021 00:28 IST|Sakshi

నిద్రలో మెడపట్టుకోవడం / మెడ ఇరుకుపట్టేయడం చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనితో వచ్చే మెడనొప్పిని తగ్గించుకోవడం కోసం హీట్‌ప్యాక్‌ (వేడికాపడం) తర్వాత కోల్డ్‌ప్యాక్‌ (ఐస్‌ముక్కలు టవల్‌లో చుట్టు కాపడంలా పెట్టడం) కొంతకొంత వ్యవధిలో చేస్తుండాలి. ఇలా మెడలు పట్టేసిన చోటగానీ లేదా మరేచోటనైనా ఒకవేళ నొప్పితో పాటు ఆ ప్రదేశం ఎర్రబారడం, వాపు కనిపిస్తే వేడికాపడం కంటే కోల్డ్‌ ప్యాక్‌ చాలా ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది.

ఇలా హీట్‌ప్యాక్, ఐస్‌ప్యాక్‌లను మార్చి మార్చి ఇస్తూ... మధ్యమధ్యన నొప్పి రానంతమేరకు మెడను నెమ్మదిగా పక్కలకు, వెనక్కు వంచాలి. కానీ ముందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వంచవద్దు. కూర్చున్నా, నిల్చున్నా, డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు మెడను నిటారుగా ఉంచాలి. ఇలా మెడనొప్పిగా ఉన్నప్పుడు మెడ ను గుండ్రంగా తిప్పవద్దు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు