భలే రుచులు.. బనానా రైస్‌ కేక్‌, డ్రైఫ్రూట్స్‌ బన్స్‌ ఎప్పుడైనా ట్రై చేశారా?

1 Nov, 2021 13:25 IST|Sakshi

ఇంటి వంటలో ఉండే రుచి, ఆరోగ్యం మరి దేనిలోనూ దొరకదు. ఈ కింది స్పెషల్‌ రెసిపీలతో మీ కుంటుంబానికి కొత్త రుచులను పరిచయం చేయండి.

బనానా రైస్‌ కేక్‌

కావలసిన పదార్థాలు
కొబ్బరి పాలు – పావు లీటర్‌
అరటిపండు గుజ్జు – అర కప్పు
అన్నం – 2 కప్పులు
పంచదార – 1 కప్పు
నెయ్యి – 1 లేదా 2 టీ స్పూన్లు
అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్కపొడి – గార్నిష్‌కి సరిపడా

తయారీ విధానం 
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కళాయిలో కొబ్బరిపాలు, పంచదార వేసి, పంచదార కరిగేవరకు తిప్పుతూ మరిగించాలి. ఆ మిశ్రమంలో అరటిపండు గుజ్జు వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా అన్నం వేసి బాగా తిప్పి.. స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. అనంతరం నచ్చిన షేప్‌ బౌల్స్‌ తీసుకుని, వాటికి నూనె లేదా నెయ్యి రాసి.. ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుని చల్లారనివ్వాలి. దానిపైన అరటిపండు ముక్కలు, దాల్చిన చెక్క పొడివేసుకుని సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది. 

చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్‌.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..

డ్రైఫ్రూట్స్‌ బన్స్‌

కావలసిన పదార్థాలు
మైదా పిండి – 500 గ్రా.
ఉప్పు – అర టీ స్పూన్‌
పంచదార – 3 టేబుల్‌ స్పూన్లు
బటర్‌ – 100 గ్రా.
పాలు – 300 గ్రా. 
గుడ్డు – 1
ఈస్ట్‌ – 1 టేబుల్‌ స్పూన్‌ (పావు కప్పు వేడినీటిలో వేసి జ్యూస్‌లా చేసుకోవాలి)
దాల్చిన చెక్కపొడి – కొద్దిగా
నూనె – కొద్దిగా

తయారీ విధానం 
ముందు ఒక పెద్ద బౌల్‌ తీసుకుని అందులో మైదాపిండి, ఉప్పు, 1 టేబుల్‌ స్పూన్‌ పంచదారతో పాటు.. ఈస్ట్‌ జ్యూస్, 50 గ్రాముల బటర్, గుడ్డు, పాలు పోసుకుని ముద్దలా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు బాగా కలిపి చపాతీ ముద్దలా చేసుకుని, కొద్దిగా నూనె పూసి, 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అది పొంగుతుంది. అనంతరం మరో పది నిమిషాలు ముద్దను మరింతగా కలిపి.. కొద్దిగా మైదా పిండి చల్లుకుంటూ అప్పడాల కర్రతో పొడవుగా వెడల్పుగా ఒత్తుకుని దానిపైన మిగిలిన బటర్‌ రాసి.. 2 టేబుల్‌ స్పూన్ల పంచదార, దాల్చిన చెక్కపొడి ఒకదాని తర్వాత ఒకటి జల్లి.. మిక్స్‌డ్‌ డ్రై ఫ్రూట్స్, బాదం ముక్కలు వంటివన్నీ మొత్తం జల్లి ఓ వైపు నుంచి చుట్టుకోవాలి.

తర్వాత గుండ్రంగా కట్‌ చేసుకుని బేకింగ్‌ ప్లేట్‌లో పెట్టుకోవాలి. అనంతరం ఒక గుడ్డు, 2 టేబుల్‌ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి.. బ్రష్‌తో బన్స్‌కి ఆ మిశ్రమాన్ని పూసి ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి. 

చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు..

మరిన్ని వార్తలు