Beauty Tips In Telugu: నల్లని కురులకు.. బ్లాక్‌ జీరా ప్యాక్‌!

18 Sep, 2021 09:39 IST|Sakshi

నల్లని కురులను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయడంలో కేశాలది ముఖ్య పాత్ర. మరి అలాంటి కురులు తెల్లబడితే.. కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు నల్లటి జుట్టు కోసం ఈ టిప్స్‌ పాటిస్తే సరి.

ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకుని వేడిచేసి... ఈ నీటిలో ఐదు టీస్పూన్ల టీ ఆకులు, రెండు టీస్పూన్ల నల్లజీలకర్ర వేసి పదిహేను నిమిషాల పాటు సన్నని మంట మీద మరిగించాలి.
నీళ్లు మరిగాక వడగట్టి నీటిని గిన్నెలో తీసుకుని దానిలో నాలుగు టీ స్పూన్ల కాఫీ పొడి, మూడు టీస్పూన్ల అలోవిరా జెల్‌ వేసి కలపాలి.


వీటిలో వడగట్టిన టీ ఆకులు కూడా వేసి పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి.
తలస్నానం చేసిన తరువాత తడి తలమీదే ఈ పేస్టుని మాడు నుంచి చివర్ల వరకు అప్లై చేసి నాలుగు గంటల తరువాత కడిగేయాలి.
వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

చదవండి: బుట్టెడు పోషకాల పుట్టగొడుగు!   
Health Tips In Telugu: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు!

మరిన్ని వార్తలు