ఎంతో టేస్టీగా ఉండే మిల్లీ మేకర్‌ రోల్స్‌ చేసుకోండి ఇలా!

3 Sep, 2023 08:34 IST|Sakshi

మీల్‌ మేకర్‌ రోల్స్‌
కావలసినవి:  చపాతీలు– 5 (గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని చపాతీలు చేసుకుని, వేయించి పక్కన పెట్టుకోవాలి)
మీల్‌ మేకర్‌ – 2 కప్పులు (ముందుగా వేడినీళ్లలో వేసుకుని కాసేపు ఉంచి.. నీళ్లు వాడిన వెంటనే కొద్దిగా ఆయిల్‌ వేసుకుని 1 నిమిషం పాటు అటూ ఇటూగా రోస్ట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి)
క్యాప్సికమ్, టొమాటో– 2 చొప్పున (ముక్కలు కట్‌ చేసుకోవాలి)
ఉల్లిపాయలు– 2 (సగం గార్నిష్‌కి), పచ్చిమిర్చి– 4 (చిన్న చిన్న ముక్కలు కట్‌ చేసుకోవాలి)
బ్రెడ్‌ పౌడర్, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి, 
జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌  చొప్పున, పసుపు – చిటికెడు, టొమాటో కెచప్‌ – 1 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ: ముందుగా నూనెలో సగం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాసేపు వేగించి.. అందులో పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు, టొమాటో ముక్కలు, మీల్‌ మేకర్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుని కూరలా దగ్గరపడే వరకూ ఉడికించుకోవాలి. తర్వాత బ్రెడ్‌ పౌడర్, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, టొమాటో కెచప్‌ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా కాల్చిన చపాతీలలో.. ఓవైపు ఈ కర్రీ వేసుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. మిగిలిన ఉల్లిపాయ ముక్కలతో వేడివేడిగా ఉన్నప్పుడే వీటిని సర్వ్‌ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. 

(చదవండి: వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!)

మరిన్ని వార్తలు