Mental Health: ఒత్తిడిని అణిచేస్తే... అంతే సంగతులు! జర భద్రం..

1 Oct, 2021 10:07 IST|Sakshi

కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఊహించని మార్పులు తీసుకొచ్చింది. వేడుకలు దూరమయ్యాయి. ఇల్లే ఆఫీసయ్యింది. సినిమాలు .. షికార్లు లేవు. జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి.  ఇంటి కే పరిమితం కావడం.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం వంటి సంఘటనలతో ఒత్తిడి, ఆందోళన పెరిగాయి. మన ఎమోషన్స్‌ని కావాలని అణచి వేసే పరిస్థితులన్నిటినీ ఎదుర్కొన్నాం. అయితే ఇలా ఫీలింగ్స్‌ని అణ చుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. 

అవసరానికి తగ్గట్లు ప్రస్తుతం మన భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో అది మన మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫీలింగ్స్‌ ని అణ చి వేసుకోవడం వల్ల మైగ్రేన్, హై బీపీ వంటి అనారోగ్యాల బారిన పడతామని, ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్‌ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

కనుక దగ్గరి వాళ్లతో మన ఫీలింగ్స్‌ని షేర్‌ చేసుకోవడం.. లేదంటే ఓ పేపర్‌ మీద రాసుకుని.. ఆ పరిస్థితుల గురించి మనమే విశ్లేషించుకోవడం మేలంటున్నారు నిపుణులు. ఇవేవి కాదంటే థెరపిస్ట్‌ని కలవమని సూచిస్తున్నారు.  

భరించడం కన్నా...
సగం అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడికి గురవడం. ఆందోళనని బయటకు వెల్లడించడం మంచిది. ఇక మన బుర్రలో నడిచే విషయాల గురించి పట్టించుకోకపోతే.. వాటిని విశ్లేషించి ఓ కొలిక్కి రాకపోతే.. ఒత్తిడి పీక్స్‌కి వెళ్తుంది. దాంతో మన మెదడు కార్టిసాల్‌ అనే ఒక హార్మోన్‌ను విడుదల చేస్తుంది. కార్టిసాల్‌  అనేది మన జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా విస్తృతమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. 

ఇది ఎక్కువ మొత్తంలో విడుదల అయితే.. మెదడు పని తీరు కుంటు పడుతుంది. దాంతో రోజువారి జీవన విధానం దెబ్బ తింటుంది. కనుక ఒత్తిడి పెరిగినప్పుడు బ్రేక్‌ తీసుకోవడం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవడంతోపాటు మనసుకు నచ్చే పనులు చేయడం మంచిదంటున్నారు మానసిక నిపుణులు.

చదవండి: బ్లాక్‌ పెప్పర్‌ వాటర్‌ ప్రతి ఉదయం తాగారంటే.. నెలరోజుల్లోనే..

మరిన్ని వార్తలు