పై పెదవి, గడ్డం మీద సన్నని రోమాలు.. శాశ్వతంగా తొలగించుకోవచ్చు ఇలా!

23 Jan, 2022 15:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ట్రైకాలజీ.. హార్వర్డ్‌ వైద్యం

How To Remove Unwanted Hair : వాతావరణ కాలుష్యం కారణంగా మహిళల్లో హార్మోన్‌ల అసమతుల్యత ఎక్కువైంది. ఫలితంగా పై పెదవి, గడ్డం మీద సన్నని రోమాలు కనిపిస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించడానికి నిపుణులైన ట్రైకాలజిస్టు సహాయం తీసుకోవాలి. కోల్‌కతా ట్రైకాలజిస్ట్‌ డాక్టర్‌ అతుల్‌ తనేజా సూచన ఇది.

లేజర్‌ కిరణాలతో చేసే ఈ చికిత్సను ‘లేజర్‌ హెయిర్‌ రిడక్షన్‌’ అంటారు. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వైద్య నిపుణులు అభివృద్ధి చేసిన ‘సెలెక్టివ్‌ ఫొటో థర్మోలిసిస్‌ విధానం’ ద్వారా ఈ చికిత్స చేస్తారు. లేజర్‌ కిరణాలు నేరుగా రోమమూలాన్ని మాత్రమే తాకుతాయి.

పక్క టిష్యూకి, చర్మానికి ఎటువంటి హాని ఉండదు. లేజర్‌ పల్స్‌డ్‌ లైట్‌ ఒకేసారి అనేక ఫాలికల్స్‌ను పట్టుకుంటుంది. కాబట్టి చికిత్సకు ఎక్కువ సమయం పట్టదు. ఈ ట్రీట్‌మెంట్‌తోపాటుగా గైనకాలజిస్టు, ఎండోక్రైనాలజిస్టు సూచనలు కూడా తీసుకోవాలి.

చదవండి: Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే...

మరిన్ని వార్తలు