Rodomontade: తనను కాదని ప్రత్యర్థితో పారిపోయినందుకు ఆమెను చంపేసి..ఆపై; అసలు ఈ పదాన్ని ఎప్పుడు వాడతారు?

10 Dec, 2021 15:34 IST|Sakshi

ఇంగ్లీష్‌ పద కథలు.. రోడమాంటేడ్‌ 

How Word Rodomontade Enter In English Dictionary What Does It Mean: రోడమాంటేడ్‌.. ఇంతకీ ఎవరీయన? మాటియో మారియా బొయార్డో రాసిన ఇటాలియన్‌ ఎపిక్‌ పోయెమ్‌ ‘ఒరియండో ఇనెమోరటో’ (ఇంగ్లీష్‌లో ఒరియండో ఇన్‌ లవ్‌)లోని ఒక క్యారెక్టర్‌ ఈ రోడమాంటేడ్‌. ఇతడు సార్జా రాజు. ఊచకోతల మాట ఎలా ఉన్నా కోతలు బాగానే కోసేవాడు. గ్రనడా రాకుమార్తెను మహా గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమె మాత్రం రాజుగారిని  కాదని అతని ప్రత్యర్థితో పారిపోతుంది.

దీంతో ఆ ప్రేమికరాజు అహం దెబ్బతింటుంది. కోపంలో పొరపాటున ఆమెను చంపేస్తాడు. ఆ తరువాత పశ్చాత్తాపానికి గురవుతాడు. ఆమె జ్ఞాపకంగా ఒక వంతెన కడతాడు. ఈ వంతెన మీద నుంచి వెళ్లేవారు తప్పనిసరిగా ఆమెకు నివాళి అర్పించాలని ఆర్డర్‌ జారిచేస్తాడు. చంపడం ఎందుకు? ఈ వోవర్‌ యాక్షన్‌ ఎందుకు? అనేది తరువాత విషయంగానీ... ఇతడి పేరు ఆంగ్ల నిఘంటువుల్లోకి దూరిపోయింది. తమకు తాము గొప్పలు చెప్పుకునేవారిని ‘రోడమాంటేడ్‌లా ప్రవర్తించకు’  అనడం పరిపాటి అయింది. 

చదవండి: Health Tips: కాలీఫ్లవర్‌ తింటే ఇన్ని ఉపయోగాలా.. బోర్‌ కొడితే ఇలా ట్రై చేయండి!
Shraddha Parekh: చేతిని గట్టిగా పట్టుకుంటే ఇంటర్నల్‌ బ్లీడింగ్‌.. ఎముకలు విరిగేవి.. 20 ఏళ్ల తర్వాత

మరిన్ని వార్తలు