వాకింగ్‌ వెహికిల్‌.. నాలుగు కాళ్ల కారు

12 Jun, 2022 13:39 IST|Sakshi

అదేం చోద్యం! కారుకు చక్రాలు ఉంటాయి గాని, కాళ్లేమిటి అని ఆశ్చర్యపోతున్నారా? ‘హ్యుండాయ్‌’ కంపెనీ తయారు చేయనున్న కారుకు నాలుగు కాళ్లు ఉంటాయి. అయితే, ఆ నాలుగు కాళ్లకూ నాలుగు చక్రాలు కూడా ఉంటాయనుకోండి.  హ్యుండాయ్‌ కంపెనీ ఈ నాలుగు కాళ్ల కారు నమూనాను 2019 నాటి కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షోలో ప్రదర్శించి, సందర్శకులను ఆకట్టుకుంది.

నాలుగు కాళ్లతో అడుగులు వేసుకుంటూ ఈ కారు ఎన్ని మెట్లయినా ఇట్టే ఎక్కేస్తుంది. అంతేకాదు, ఎంత ఎ‍త్తైన గుట్టలనైనా అవలీలగా ఎగబాకగలదు. లోపల ప్రయాణించే వారికి పెద్దగా కుదుపుల్లేకుండా, గుట్టల్లోని ఎగుడు దిగుడు ప్రయాణం సుఖప్రదంగా సునాయాసంగా సాగేందుకు వీలుగా ఈ విచిత్ర వాహనాన్ని త్వరలోనే రూపొందించడానికి హ్యుండాయ్‌ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీని తయారీ కోసం అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. 

మరిన్ని వార్తలు