Meet One's Waterloo Origin: ఈ జాతీయాన్ని ఎప్పుడు వాడతారో తెలుసా?

18 Mar, 2022 13:55 IST|Sakshi

మెట్‌ దేర్‌ వాటర్‌లూ

ఒక వ్యక్తి తన కెరీర్‌లో వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. అట్టి విజేతకు ఒక పరాజయం ఎదురైంది. పరాజయం ఒకసారి ఎదురైనా మళ్లీ నిలదొక్కుకునే వాళ్లు ఉంటారు. అలా కాకుండా ఆ పరాజయం అతడి కెరీర్‌నే మసకబార్చితే, అతడి జీవితాన్ని అగాధంలోకి తోస్తే....అదే ‘మెట్‌ దేర్‌ వాటర్‌లూ’ ఇడియమ్‌.

ఉదా: ఎవ్రీ మ్యాన్‌ మీట్స్‌ హిజ్‌ వాటర్‌లూ ఎట్‌ లాస్ట్‌ నేపథ్యంలోకి వెళితే...
ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ని తిరుగులేని వీరుడు అంటారు. అలాంటి వీరుడి జీవితం ఒక యుద్ధం(వాటర్‌లూ)తో తలకిందులైపోయింది. సెంట్రల్‌ బెల్జియంలో 1815లో నెపోలియన్‌ సైన్యానికి, ‘ఫస్ట్‌ డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్టన్‌’ అర్థర్‌ వెల్లెస్లీ నాయకత్వంలోని బ్రిటన్, నెదర్‌లాండ్స్‌... మొదలైన సంకీర్ణసేనలకు మధ్య యుద్ధం జరిగింది.

ఈ యుద్ధంలో నెపోలియన్‌ ఓడిపోతాడు. మరోవైపు అర్థర్‌ స్వదేశంలో హీరోగా వెలిగిపోతాడు. నెపోలియన్‌ ఓటమి యూరోపియన్‌ రాజకీయ, సామాజిక చరిత్రలో కీలకమైన ఘట్టం అయింది. ఫ్రెంచ్‌ ఆధిపత్య ధోరణికి తెరపడేలా చేసింది. 

చదవండి: World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్‌ విషయాలు

మరిన్ని వార్తలు