సెలక్షన్‌ స్టైల్‌

17 Feb, 2023 01:07 IST|Sakshi

ఈ స్టైల్‌కి ప్రత్యేక ఎంపికలు అవసరం లేదు. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌కే మొదటిప్రా ధాన్యత.ఆభరణాల ఎంపికకు అసలు పో టీ అక్కర్లేదు.పూసలు, సిల్వర్, ఉడ్‌ జ్యువెల్రీ ఏదైనా సెలక్షన్‌ మహా ఈజీ. ఎవరికి వారు తమకంటూ ఓ స్పెషల్‌ లుక్‌ను  క్రియేట్‌ చేసుకునే సౌలభ్యం ఈ స్టైల్‌ సొంతం. అందుకే, కాలాలతో పనిలేకుండా యూత్‌ని అమితంగా ఆకట్టుకుంటున్న మోడర్న్‌ బోహో–చిక్‌ స్టైల్‌ ఇది.

యువతను అమితంగా ఆకట్టుకునే వాటిలో బోహేమియన్‌ స్టైల్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఇది ఫ్రెంచ్‌ నుంచి వచ్చిన శైలిగా చెబుతుంటారు. ఇది గిరిజన జీవన శైలి కి దగ్గరగా ఉండటం, మనసులను ఉల్లాసంగా ఉంచడంతోపా టు చాలా బాగా అట్రాక్ట్‌ చేస్తుంటుంది.

గతంలో పా ప్, ర్యాప్‌ ఈవెంట్లలో బోహో–చిక్‌ ఫ్యాషన్‌ శైలి దుస్తులను ధరించేవారు. ఇప్పుడు మోడర్న్‌ స్టైల్‌ను అనుసరిస్తూ జీన్స్‌తో, పలాజోలతో ఇక్కత్‌ పైస్లీ బ్లౌజులు, బటన్‌ డౌన్‌ టాప్స్, ఖఫ్తా న్స్‌ ఆకట్టుకుంటున్నాయి. వీటి మీదకు ట్రైబల్‌ జ్యువెలరీ లేదా ఫ్యాషన్‌ జ్యువెలరీ మరింత ఆధునిక హంగులతో మది దోచుకుంటున్నాయి. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు