ఆలియా భట్‌ కోసం ఇరవై ఏళ్ల ముందే..!

17 Jul, 2022 09:13 IST|Sakshi

యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే దర్శకుడు ఇంతియాజ్‌ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్‌ ఏర్పడాలనుకుంటాడు. అందుకే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లేముందు టీమ్‌ను ఏదైనా ట్రిప్‌కి పంపిస్తాడట. తన సినిమాకు కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్‌ రాసిపెట్టుకుంటాడు.  ‘హైవే’ కోసమైతే ఆలియా భట్‌ను (29) తాను ఫస్ట్‌టైమ్‌   చూసిన వెంటనే (అప్పుడు  ఆమెకు తొమ్మిదేళ్లు) స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టాడుట.  

నటీనటుల లైఫ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌నూ కథలో భాగంగా చూపించే ప్రతయ్నం చేస్తాడు. ఆయన ‘తమాషా’లో కథానాయకుడు.. అతని తండ్రికి మధ్య చూపించిన అనుబంధం.. ఆ సినిమా హీరో రణ్‌బీర్‌ కపూర్, అతని తండ్రి రిషి కపూర్‌కు మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా చిత్రీకరించిందేనట.  

మరిన్ని వార్తలు