ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..!

17 Oct, 2021 16:34 IST|Sakshi

మీకు ఎడమచేతివాటం అలవాటా? లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైన ఉ‍న్నారా? వీరి గురించి శాస్త్రవేత్తలు తెలియజేసే ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకోండి..

►భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10 శాతం మాత్రమే ఎడమచేతివాటం వ్యక్తులు ఉన్నారు.

►కుడిచేతివాటం వ్యక్తులతోపాల్చితే వీరికి ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు మూడు రెట్లు ఎక్కువట.

►మెదడులో కుడి భాగాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు.

►యుక్తవయసులోకి 4 నుంచి 5 నెలలు ఆలస్యంగా అడుగుపెడతారు.

►ప్రముఖ టెన్నిస్‌ ఆటగాళ్లలో 40శాతం ఎడమచేతివాటం ఉన్నవారే ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎడమచేయి అలవాటు ఉన్నవాళ్లు బేస్‌బాల్‌ ఆటల్లో నిష్ణాతులట. టెన్నీస్‌, స్విమ్మింగ్‌, బాక్సింగ్‌ ఆటలు బాగా ఆడతారట.

►మొత్తం 26 అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. జేమ్స్ ఎ గార్ఫీల్డ్, హెర్బర్ట్‌ హూవర్‌, హ్యారీ ఎస్‌ ట్రూమాన్‌, గెరాల్డ్‌ ఫోర్డ్‌, రోనాల్డ్‌ రీగన్‌, జార్జ్‌ హెచ్‌డబ్యూ బుష్‌, బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామా.

►గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన లెఫ్ట్‌ హ్యండ్‌ వ్యక్తుల్లో 26 శాతం మంది ధనవంతులౌతారు.

►చరిత్రలో మంచికి కానీ చెడుకి కానీ పేరుగాంచిన వారిలో ఎడమచేతివాటం ఉన్నవాళ్లే ఎక్కువగా మంది కనిపిస్తారు. వీరిలో సృజనాత్మకత, సంగీత సామర్ధ్య లక్షణాలు కూడా ఎక్కువేనట. బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం గలవారే.

►left అనే ఇంగ్లీష్‌ పదం ఆంగ్లో సక్సాన్‌ పదమైన lyft నుంచి వచ్చింది. దీనికి విరిగిన లేదా బలహీణం అని అర్థం.

►20 యేళ్ల మహిళలతో పోల్చితే 40 యేళ్లు దాటిన స్త్రీలు 128 శాతం ఎడమచేతివాటం ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారట.

►ఎడమచేతివాటం వ్యక్తులు గణితం, భవన నిర్మాణ (ఆర్కిటెక్చర్‌), అంతరిక్ష రంగాల్లో మరింత ప్రతిభావంతులని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుడిచేతి వారు మాటలు చెప్పడంలో నిష్ణాతుని కూడా పేర్కొన్నాయి.

►ప్రతి నలుగురు అంతరిక్ష వ్యోమగాముల్లో ఒకరు ఎడమచేతివాటం వారే!

►అమెరికా జనాభాలో 30 లక్షల మంది ఎడమచేతివాటం పౌరులున్నారు.

►వీరికి ఆస్థమా, అలర్జీల సమస్యలు అధికంగా ఉంటాయి.

►ఎడమచేతికి గాయమైతే, కుడిచేత్తో పనులు చేయడం త్వరగానే నేర్చుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

►బ్రిటీష్ రాజ కుటుంబంలో క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీళ్లంగా ఎడమచేతివాటం వారే. కుటుంబాన్ని ముందుకు నడిపే నైపుణ్యం వీళ్లకి ఎక్కువే.

►వీరు ఇన్‌సోమ్నియా అనే నిద్రలేమి వ్యధికి ఎక్కువగా గురౌతారు.

►ఆగస్ట్‌ 13ను ఇంటర్‌నేషనల్‌ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు.

►వీరు పొడవైన పదాలను స్పీడ్‌గా టైప్‌ చేయగలరట.

►ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు కుడిచేతి వాటం వారి కంటే నీటి అడుగున ఉన్నవాటిని స్పష్టంగా చూడగలుగుతారు. 

►కుడి చేతివాళ్ల కంటే వీరిలో కొంచెం కోపం ఎక్కువని జర్నల్ ఆఫ్ నెర్వస్ అండ్ మెంటల్ డిసీజ్ నిర్వహించిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రముఖ టెన్నీస్‌ ఆటగాడు జాన్ మెక్‌ఎన్రో చాలా కోపిష్టి. ఇతను ఎడమచేతి వాటం ఆటగాడే. 

ఇవన్నీ పరిశోధనల్లో తేలిన విషయాలు. ఐతే అందరిలో ఇక్కడ ఇచ్చిన అన్ని లక్షణాలు ఉండక పోవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలను మాత్రమే పేర్కొనడం జరిగింది.

చదవండి: ఈ వాటర్‌ బాటిల్‌ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు..

మరిన్ని వార్తలు