Kutch Lippan Art: ‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయకండి! మట్టి మెరిపిస్తున్న అద్దాలతో..

23 Jul, 2022 16:11 IST|Sakshi

‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయడానికి లేదు. మట్టి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ మట్టికి అద్దం కూడా తోడైతే చూడ్డానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది.  అలాంటి కళ పేరే లిప్పన్‌ ఆర్ట్‌. ఇది కచ్‌ ప్రజల మనసు కళ. మట్టి–అద్దాలతో కలసిన ఈ ఆర్ట్‌పీస్‌లు ఇంటి గోడలను అందంగా చూపిస్తున్నాయి.  

మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కళ
కచ్‌ శివారు గ్రామాల్లోని బంజరు భూముల గుండా వెళుతున్నప్పుడు అద్దాలతో అలంకరించిన మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఆ ఇళ్లల్లోని మహిళల చేతుల్లోనే ఈ లిప్పన్‌ ఆర్ట్‌ కనపడుతుంది.. ఇలా మట్టి కళా రూపాలుగా. విశేషమేమంటే  వీటి తయారీలో ఎలాంటి అచ్చులను, మూసలను ఉపయోగించరు. 

క్లిష్టమైన సౌందర్యం
మడ్‌ మిర్రర్‌ వర్క్‌.. దాని సౌందర్యం ఆధునిక ప్రపంచపు దృష్టినీ ఆకర్షిస్తోంది. పట్టణాల్లోని ఇంటి గోడలపైన అందంగా మెరిసిపోతోంది. నిరాడంబరమైన ఈ ఆర్ట్‌ ఆడంబరంగా వెలిగిపోతోందిప్పుడు. 

ఎలా చేస్తారంటే.. 
లిప్పన్‌ ఆర్ట్‌కు డిమాండ్‌ పెరగడంతో తయారీ తీరు మారింది. ఎలాగంటే.. ముందు.. ప్లైవుడ్‌ పైన పెన్సిల్‌తో డిజైన్‌ గీస్తారు. తర్వాత మెత్తని మట్టిని నీటితో కలిపి... దాన్ని డిజైన్‌కి అనుగుణంగా పూసి, దానిపై అద్దాలు అతికించి.. రంగులు వేస్తారు. ఇది చాలా నైపుణ్యంతో కూడుకున్న పని కావడంతో ఈ శైలి అరుదైన కళగా ఆకట్టుకుంటోంది.  

చదవండి: ‘క్రీస్‌ కప్స్‌’.. కాఫీతోనే కప్పులు తయారీ..!

మరిన్ని వార్తలు