ఈ రోజే ఫ్రెండ్‌షిప్‌ డే ఎందుకు?

30 Jul, 2020 17:07 IST|Sakshi

అన్నింటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం. భూమ్మిద ఉండే ఏ బంధంలోనైనా స్నేహం ఉంటుంది. ఈ బంధానికి ఎల్లలు ఉండవు. తల్లిదండ్రులకు పిల్లల మధ్య, సోదరుల మధ్య ఆఖరికి భార్యభర్తల మధ్య కూడా స్నేహం ఉంటుంది. అంతటి గొప్ప స్నేహ బంధానికి గుర్తుగా ప్రతి ఏడాది ‘స్నేహితుల దినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఫ్రెండ్‌షిప్‌ డేని ప్రపంచ దేశాలు ఒకేరోజు జరుపుకోవు. ఒక్కోదేశం ఒక్కోరోజు జరుపుకుంటుంది. భారతదేశం, అమెరికాతో సహా చాలా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్స్‌ షిప్‌ డే జరుపుకుంటాయి. కానీ మిగతా దేశాల్లో కొన్ని జులై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. జూలై 30న స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చిందో​ తెలుసుకుందాం.

ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని మొదటిసారిగా 1958 జూలై 30 డాక్టర్‌ రామోన్‌ ఆర్టెమియా ప్రతిపాదించారు. ఈయన బ్రాచో పరాగ్వేలోని అసున్స్‌యోన్‌కు ఉత్తరాన 200 మైళ్ల దూరంలో పరాగ్వే నదిపై ఉన్న ప్యూర్టొ పినాస్కో అనే పట్టణంలో జూలై 30న స్నేహితుల కోసం విందును ఏర్పాటు చేశాడు. ఈ విందు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది జూలై 30న ‘స్నేహితుల దినోత్సంగా’ నిర్వహించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అప్పుడే ‘స్నేహితుల దినోత్సవం’ అనే ప్రత్యేక రోజు పుట్టింది. ఈ రోజున జాతి, రంగు, కుల, మత బేధాలు లేకుండా మనుషులంతా స్నేహ భావంతో మెలిగేందుకు ప్రతికగా స్నేహితుల దినోత్సవం పుట్టింది. అప్పటి నుంచి పరాగ్వేలో ప్రతి ఏటా జూలై 30 స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితిగా మారింది.

ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రపంచ రాయబారి,సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ భార్య నానే అన్నన్‌ 1998 జూలై 30ను అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రతిపాదించారు. అనంతరం ఏప్రిల్‌ 27 2011న ఐక్యరాజ్యసమితి జూలై 30ని ‘ప్రపంచ స్నేహితుల దినోత్సవంగా’ ప్రకటించింది. యుఎన్‌ఓ ప్రతిపాదనను చాలా దేశాలు కూడా స్వీకరించాయి. అయినప్పటికి కొన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన ఈ తేదికి ముందు లేదా తర్వాత ఫ్రెండ్‌షిప్‌ డేను సెలబ్రెట్‌ చేసుకుంటున్నాయి. భారత్‌, అమెరికా, ఐరోపా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకుంటుండగా.. ఒబెరిన్‌, ఓహీయో దేశాలు ఏప్రిల్‌​ 9న, నేపాల్‌ జూలై 30న ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిష్టాత్మంగా జరుపుకుంటున్నాయి. 

మరిన్ని వార్తలు